AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vitamin B12 Benefits: అమ్మ కావాలనుకుంటున్నారా..? ఆ విటమిన్ లోపం ఉంటే సమస్యలు చుట్టుముట్టినట్లే..

Vitamin B12: శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి వాటిలో విటమిన్ B12 ఒకటి.

Vitamin B12 Benefits: అమ్మ కావాలనుకుంటున్నారా..? ఆ విటమిన్ లోపం ఉంటే సమస్యలు చుట్టుముట్టినట్లే..
Vitamin B 12
Shaik Madar Saheb
|

Updated on: Jul 24, 2022 | 6:24 PM

Share

Importance of Vitamin B12: ఆధునిక కాలంలో మనుషులను ఎన్నో రోగాలు చుట్టుముడుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి వాటిలో విటమిన్ B12 ఒకటి. శరీరానికి అవసరమైన ఈ విటమిన్ గురించి చాలా తక్కువమందికి తెలుసు. విటమిన్ బి 12 మన శరీరాన్ని పలు సమస్యల నుంచి కాపాడుతుంది. అందుకే గర్భిణులు రోజువారీ ఆహారంలో విటమిన్ 12 పోషకాలను చేర్చుకోవాలి. అప్పుడే మనం ఆరోగ్యకరమైన జీవితాన్ని సాకారం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈ విటమిన్ మన కేంద్ర నాడీ వ్యవస్థ అభివృద్ధికి చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఎర్ర రక్త కణాలు ఏర్పడి శరీరంలో DNA సంశ్లేషణ జరుగేలా చేస్తుంది.

ఈ ఆహారాల నుంచి విటమిన్ బి 12 లభిస్తుంది..

మన శరీరంలో విటమిన్ బి 12 లోపం ఉంటే.. దాని ద్వారా తీవ్రమైన పరిణామాలు ఎదురుకావొచ్చు. దీన్ని నివారించడానికి రోజువారీ ఆహారంలో కొన్ని ప్రత్యేక ఆహారాలను చేర్చుకోవచ్చు. దీని కోసం .. మాంసం, చేపలు, చికెన్, గుడ్లు, పాలు వంటి జంతు ఉత్పత్తులను తినాలి. శాకాహారులుగా ఉండే వారు ఈ విటమిన్ లోపానికి ఎక్కువగా గురవుతారని పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

విటమిన్ B12 శోషణ చిన్న పేగులలో జరుగుతుంది. ముఖ్యంగా చిన్న ప్రేగు చివరిలో దీనిని ఇలియం అని పిలుస్తారు. పేగులలో B12 సరిగ్గా గ్రహించబడుతుందో లేదో నిర్ధారించుకోవడం ముఖ్యం.

విటమిన్ B12 ప్రయోజనాలు..

రక్తహీనత దూరమవుతుంది: విటమిన్ B12 అధికంగా ఉండే ఆహారాన్ని సరైన మోతాదులో తీసుకుంటే.. శరీరంలో రక్తహీనత లోపం దూరమవుతుంది. ఈ పోషకాలలో లోపం ఉన్నవారు రక్తహీనతకు గురవుతారు.. ఎందుకంటే ఎర్ర రక్త కణాలు తగ్గడం ప్రారంభమవుతుంది.

గర్భిణులకు ముఖ్యమైనది: విటమిన్ B12 ఉన్న ఆహారాన్ని క్రమం తప్పకుండా తినాలి. ఎందుకంటే కడుపులో ఉన్న పిల్లల మెదడు అభివృద్ధికి ఇది అవసరం. గర్భధారణ సమయంలో ఈ కీలకమైన పోషకాహారం లోపం ఉన్నట్లయితే.. బిడ్డ పుట్టినప్పుడు మెదడు, వెన్నుముకలో సమస్యలు తలెత్తుతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..