Watch Video: రిషబ్ పంత్‌పై ఆగ్రహించిన రోహిత్ శర్మ.. సైగలు చేస్తూ ఏమన్నాడంటే? నెట్టింట వైరల్ వీడియో
వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ 64 పరుగులతో పవర్ ఫుల్ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే పేలవమైన షాట్ ఆడిన రిషబ్ పంత్ పట్ల అసంతృప్తిగా కనిపించాడు.
వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన ఫామ్‌లో కనిపించాడు.ఇంగ్లాండ్ పర్యటనకు ముందు రోహిత్ శర్మ ఫామ్‌పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఐపీఎల్ 2022లో అతని బ్యాట్ నుంచి ఒక్క ఫిఫ్టీ కూడా రాలేదు.అయితే ఈ నెల ప్రారంభంలో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో అతను 58 బంతుల్లో 76 పరుగులు చేసి ఫామ్‌లోకి తిరిగి వచ్చినట్లు కనిపించాడు. శుక్రవారం వెస్టిండీస్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో రోహిత్ శర్మ తన పాత స్టైల్‌లో కనిపించాడు. 44 బంతుల్లో 64 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు.రోహిత్ నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించాడు. కానీ, సెట్ అయ్యాక, భారీ షాట్లు ఆడటం ప్రారంభించాడు. రోహిత్ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు బాదేశాడు.
సూర్యకుమార్, రోహిత్‌లు జట్టుకు శుభారంభం అందించారు. అనంతరం, యాదవ్ 16 బంతుల్లో 24 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత భారత్ శ్రేయాస్ అయ్యర్, పంత్ వికెట్లను త్వరగా కోల్పోయింది. అయితే బ్యాడ్ షాట్ ఆడిన పంత్.. త్వరగా పెవిలియన్ చేరాడు. పంత్ కొట్టిన షాట్ పట్ల రోహిత్ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. పంత్ పట్ల కోపంగా కనిపించాడు.
India losing wickets in quick succession as @RishabhPant17 and @hardikpandya7 departs without ticking the score board much.
Watch the India tour of West Indies LIVE, only on #FanCode ? https://t.co/RCdQk12YsM@BCCI @windiescricket #WIvIND #INDvsWIonFanCode #INDvsWI pic.twitter.com/6H850WDdIT
— FanCode (@FanCode) July 29, 2022
ఈ ఘటన భారత్ ఇన్నింగ్స్ 10వ ఓవర్‌లో చోటుచేసుకుంది.ఆల్-రౌండర్ కీమో పాల్ ఆఫ్-స్టంప్ వెలుపల బంతిని విసిరాడు. దానిని పంత్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్ అంచుని తీసుకొని షార్ట్ థర్డ్‌లో ఉన్న అకీల్ హోస్సిన్ చేతుల్లోకి వెళ్లింది.
నాన్‌స్ట్రైక్‌లో నిలబడిన రోహిత్, పంత్ ఔట్ అవ్వడం చూసి, ఆగ్రహించాడు. ఆ బంతికి మెరుగైన డైరెక్షన్‌తో మంచి షాట్ ఆడగలవని పంత్‌కి సైగ చేశాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ మొదటి T20లో నాలుగో నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగాడు. పంత్ ఓపెనింగ్ చేయగలడని అనుకున్నా.. రోహిత్‌తో కలిసి సూర్యకుమార్ ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. సూర్యకుమార్ 16 బంతుల్లో 24 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.