Viral Video: వీల్ చైర్‌లో ఫుడ్ డెలివరీ.. ఫిదా అవుతోన్న నెటిజన్లు.. వైరల్ వీడియో..

ఒకప్పుడు ఇతనిపై జాలిగా చూసే వారు.. కానీ, నేడు తన కాళ్లపై తానే నిలబడుతూ, ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న ఈ వీడియో చూస్తే మీరు కూడా సలాం చేయాల్సిందే.

Viral Video: వీల్ చైర్‌లో ఫుడ్ డెలివరీ.. ఫిదా అవుతోన్న నెటిజన్లు.. వైరల్ వీడియో..
Zomato Agent Viral Video
Follow us
Venkata Chari

|

Updated on: Jul 28, 2022 | 11:18 AM

నెట్టింట్లో ప్రతిరోజు ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో ఏదో ఒక కోణం.. ఆ వీడియోలను నెటిజన్లను తెగ ఆకట్టుకునేలా చేస్తోంది. ప్రస్తుతం ఓ Zomato డెలివరీ బాయ్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియో చూసిన తర్వాత ఆవ్యక్తి ఆత్మస్థైర్యానికి సలాం చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. వికలాంగుడైనప్పటికీ, ఈ వ్యక్తి తన మనోధైర్యాన్ని కోల్పోలేదు. వీల్ చైర్‌లో తిరుగుతూ ఇంటింటికీ ఆహారాన్ని అందించే పనిని చేస్తున్నాడు. ఈ వ్యక్తిని ఒకప్పుడు జాలిగా చూసే వారు. నేడు ఆయన కాళ్లపై నిలబడి, తన బాధ్యతను, కుటుంబ పోషణకు తనవంతు సహాయంగా నిలిస్తున్నాడు. డెలివరీ బాయ్‌కి సంబంధించిన ఈ వీడియో అందరి హృదయాలను హత్తుకుంటుంది. మరికొందరు భావోద్వేగానికి గురవుతున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో, జోమాటో డెలివరీ బాయ్ వీల్‌చైర్‌లో కూర్చుని తన లొకేషన్‌కు వెళ్లడాన్ని మీరు చూడొచ్చు. అయితే, వీల్‌చైర్‌లో మోటారు ఉండడంతో ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి సౌకర్యవంతంగా చేరుకుంటున్నాడు. ఇప్పటి వరకు సైకిల్, బైక్‌పై మాత్రమే ఫుడ్ డెలివరీ చేయడం చూసి ఉండాలి. అయితే ఈ వీల్‌చైర్ ఫుడ్ డెలివరీ ఏజెంట్‌ను చూసిన ప్రజలు భావోద్వేగానికి గురవుతున్నారు. అయితే ఈ డెలివరీ బాయ్‌ని ఎంతోమంది ప్రశంసిస్తూ, కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో సోషల్ మీడియాలో వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వ్యక్తి స్ఫూర్తికి ప్రజలు సెల్యూట్ చేస్తు్న్నారు. ఈ వీడియో Instagramలో groming_bulls_ అనే ఖాతా నుంచి షేర్ చేశారు. స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం అంటూ క్యాఫ్షన్ అందించారు. అప్‌లోడ్ చేసినప్పటి నుంచి వీడియోను 1 లక్ష 33 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంది.