Viral: విమానంలో తనిఖీలు చేస్తుండగా.. సీట్ కింద అనుమానాస్పద బ్యాగ్.. ఓపెన్ చేయగా మైండ్ బ్లాంక్!

కస్టమ్స్ అధికారులు ఆ విమానంలో తనిఖీలు చేపట్టారు. వారు ఓ సీట్ కింద అనుమానాస్పద బ్యాగ్‌ను గుర్తించారు...

Viral: విమానంలో తనిఖీలు చేస్తుండగా.. సీట్ కింద అనుమానాస్పద బ్యాగ్.. ఓపెన్ చేయగా మైండ్ బ్లాంక్!
Representative Image
Follow us

|

Updated on: Jul 28, 2022 | 12:06 PM

‘శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు’ అన్నట్లుగా కస్టమ్స్ అధికారులు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. స్మగ్లర్లు రోజుకో కొత్త పద్దతిలో విదేశాల నుంచి అక్రమంగా గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నారు. అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నా.. పుష్పరాజ్‌లా తగ్గేదేలే అన్నట్లు రెచ్చిపోతున్నారు స్మగ్లర్లు. ముఖ్యంగా దుబాయ్ నుంచి అక్రమ గోల్డ్ రవాణా ఎదేచ్చగా సాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా జైపూర్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు కేజీ బంగారం బిస్కెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ. 52.10 లక్షలు ఉండొచ్చునని అంచనా.

వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం దుబాయ్ నుంచి జైపూర్ వచ్చిన స్పైస్ జెట్ విమానంలో అక్రమంగా బంగారం రవాణా జరుగుతోందని పక్కా సమాచారం అందటంతో.. కస్టమ్స్ అధికారులు ఆ విమానంలో తనిఖీలు చేపట్టారు. వారు ఓ సీట్ కింద అనుమానాస్పద బ్యాగ్‌ను గుర్తించారు. అందులో కేజీ బంగారం బిస్కెట్ కనిపించింది. సీట్ నెంబర్ ఆధారంగా ప్రయాణీకుడిని గుర్తించిన పోలీసులు.. అతడిని ఎయిర్‌పోర్ట్‌లో విచారించారు. దీంతో అసలు నిజం బయటపడింది.

దుబాయ్ నుంచి వచ్చేటప్పుడు.. ఓ వ్యక్తి పార్శిల్ ఇచ్చి తన సీట్ కింద పెట్టుకోమన్నాడని.. అందుకోసం రూ. 10 వేలు తన బ్యాంక్ అకౌంట్‌లో వేశాడని సదరు ప్రయాణీకుడు విచారణలో పేర్కొన్నాడు. అనంతరం అతడ్ని అరెస్ట్ చేసి కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో ఎయిర్ లైన్స్ సిబ్బంది ప్రమేయం కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు కస్టమ్స్ అధికారులు. ఆ దిశగా విచారణ చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..