AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhurandhar 2: ధురంధర్ 2 మేకర్స్ మాస్టర్ ప్లాన్.. వారం రోజుల ముందు రీ రిలీజ్..

ధురంధర్ తుఫాను ఇంకా అయిపోయలేదు. మార్చి 19న ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ధురంధర్ ది రివెంజ్ విడుదలకు ముందు, జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 500 స్క్రీన్‌లలో అరుదైన థియేట్రికల్ రీ-రిలీజ్‌లో ప్రపంచవ్యాప్తంగా ధురంధర్‌ను తిరిగి స్క్రీన్ పైకి తీసుకువస్తున్నాయి

Dhurandhar 2: ధురంధర్ 2 మేకర్స్ మాస్టర్ ప్లాన్.. వారం రోజుల ముందు రీ రిలీజ్..
Dhurandhar
Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Mar 12, 2026 | 1:52 PM

Share

ధురంధర్ తుఫాను ఇంకా అయిపోలేదు.. ఇప్పుడే మొదలవుతుంది. మార్చి 19న ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ధురంధర్ ది రివెంజ్ విడుదలకు ముందు, జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 500 స్క్రీన్‌లలో అరుదైన థియేట్రికల్ రీ-రిలీజ్‌లో ప్రపంచవ్యాప్తంగా ధురంధర్‌ను తిరిగి స్క్రీన్ పైకి తీసుకువస్తున్నాయి. వీటిలో మార్చి 12 నుంచి ఇండియాలో 250 స్క్రీన్‌లు.. విదేశాలలో 250 స్క్రీన్‌లు మార్చి 13 నుంచి ప్రదర్శనలు ప్రారంభమవుతున్నాయి. ఈ ఫ్రాంచైజ్ అభిమానులకు ఇది ప్రత్యేకమైన అవకాశం. మొదటి భాగాన్ని మళ్లీ థియేటర్‌లో చూసి, కొన్ని రోజుల తర్వాతే వచ్చే సీక్వెల్ ధురంధర్: ది రివెంజ్ ను బిగ్ స్క్రీన్ పై ఎక్స్ పీరియన్స్ చేసే అవకాశం లభించనుంది. స్పై-యాక్షన్ జానర్‌కు కొత్త ప్రమాణాలు సృష్టించిన ఈ సినిమా మళ్లీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. భారతదేశంలో పెద్ద సినిమాలు రీ-రిలీజ్ కావడం అప్పుడప్పుడు కనిపించినా, హిందీ సినిమాలు అంతర్జాతీయంగా మళ్లీ విడుదల కావడం చాలా అరుదు. అందుకే ఈ నిర్ణయం ఫ్రాంచైజ్‌కు మరో పెద్ద మైలురాయిగా నిలుస్తోంది.

ఉత్తర అమెరికాలోనే ఈ చిత్రం దాదాపు 185 స్క్రీన్లలో ప్రదర్శించబడుతోంది. ఇది సినిమాపై వున్న ఎక్సయిట్మెంట్ ని తెలియజేస్తోంది. మరింత ఉత్సాహాన్ని పెంచుతూ, ‘ధురంధర్: ది రివెంజ్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలకు ఒక రోజు ముందుగా మార్చి 18న అమెరికా, కెనడా అంతటా ప్రత్యేక ప్రీమియర్ షోలు నిర్వహించనుంది. ఈ ప్రీమియర్ షోలు ఎక్కువగా ప్రీమియం లార్జ్ ఫార్మాట్ (PLF) స్క్రీన్లలో ప్రదర్శించబడతాయి. వీటిలో భారీ స్క్రీన్లు, డాల్బీ Atmos వంటి అత్యుత్తమ సౌండ్ సిస్టమ్స్, గ్రేట్ ప్రొజెక్షన్ టెక్నాలజీ, లగ్జరీ సీటింగ్ వంటి అత్యాధునిక సదుపాయాలు ఉంటాయి. సాధారణంగా ఈ రకమైన ఫార్మాట్లు భారీ హాలీవుడ్ ఈవెంట్ సినిమాలకే కేటాయిస్తారు. ఇప్పటికే ఈ మిడ్-వీక్ ప్రీమియర్ షోలు చాలా చోట్ల సోల్డ్ అవుట్ అవుతున్నాయి. దీంతో ఈ సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో ఉన్న భారీ ఆసక్తి, అలాగే సినిమా విడుదల కానున్న స్థాయి స్పష్టంగా కనిపిస్తోంది.

ఇటీవల విడుదలైన ‘ధురంధర్: ది రివెంజ్’ ట్రైలర్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది. ఈ సినిమా అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా భారీ వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సీక్వెల్ విడుదలకు కొద్ది రోజుల ముందు మొదటి భాగం ‘ధురంధర్’ మళ్లీ థియేటర్లలోకి రావడంతో, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు మరోసారి ఈ ఫ్రాంచైజ్ అందించిన థ్రిల్ ను బిగ్ స్క్రీన్ పై ఎక్స్ పీరియన్స్ చేయడానికి సిద్ధమయ్యారు. జియో స్టూడియోస్ సమర్పణలో, B62 స్టూడియోస్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. ఈ హై-ఓల్టేజ్ స్పై యాక్షన్ చిత్రానికి ఆదిత్య ధర్ కథ, దర్శకత్వం అందించగా జ్యోతి దేశ్‌పాండే, లోకేష్ ధర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 2026 మార్చి 19న గుడి పాడ్వా, ఉగాది పండుగల సందర్భంగా, ఈద్‌కు ముందు ‘ధురంధర్: ది రివెంజ్’ థియేటర్లలో విడుదల కానుంది. స్పై స్టోరీ వరల్డ్ వైడ్‌గా 2026 మార్చి 19న థియేటర్లలోకి రాబోతుంది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us