AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముంబై ఫేవరెట్ స్నాక్‌ను పరిచయం చేసిన ప్రియాంక చోప్రా! విదేశీయులు ఇండియా వస్తే తినాల్సిందే

గ్లోబల్ స్టార్‌గా ఎదిగి, హాలీవుడ్‌లో సెటిలైనప్పటికీ తన మూలాలను అస్సలు మర్చిపోనని దేశీ గర్ల్ ప్రియాంకా చోప్రా మరోసారి నిరూపించుకుంది. భారతదేశం అంటేనే రకరకాల రుచుల సమాహారం. ఇక్కడ ప్రతి రాష్ట్రానికి, ప్రతి నగరానికి ఒక ప్రత్యేకమైన వంటకం ఉంటుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గ్లోబల్​ స్టార్​ ప్రియాంకా చోప్రా, విదేశీయులు మొదటిసారి ఇండియాకు వస్తే ఏ వంటకం తినాలో సూచించింది. ముంబై వీధుల్లో దొరికే ఆ చిరుతిండి గురించి ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ముంబై ఫేవరెట్ స్నాక్‌ను పరిచయం చేసిన ప్రియాంక చోప్రా! విదేశీయులు ఇండియా వస్తే తినాల్సిందే
Priyanka Chopraa Jones
Nikhil
|

Updated on: Mar 12, 2026 | 7:30 AM

Share

భారతదేశం ఎంత వైవిధ్యమైనదో, ఇక్కడి రుచులు కూడా అంతే భిన్నంగా ఉంటాయి. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లే కొద్దీ మసాలాలు, వండే పద్ధతులు మారిపోతుంటాయి. అందుకే “ఇండియాలో బెస్ట్ డిష్ ఏది?” అని ఎవరైనా అడిగితే సమాధానం చెప్పడం చాలా కష్టం. కానీ, మన ‘దోస్తానా’ నటి మాత్రం ముంబై నగరం విషయానికి వస్తే అస్సలు తడబడకుండా తన ఫేవరెట్ స్నాక్ పేరు చెప్పేసింది. ముంబై వాసులందరూ గర్వంగా ఫీలయ్యే ఆ వంటకం మరేదో కాదు.. భేల్!

ముంబై వీధుల రుచి

కాండే నాస్ట్ ట్రావెలర్‌తో జరిగిన సంభాషణలో ఆమె మాట్లాడుతూ.. “ముంబై వెళ్తే కచ్చితంగా ‘భేల్’ తినాల్సిందే” అని చెప్పుకొచ్చింది. పేలాలతో చేసే ఈ స్నాక్‌లో ఉండే పులుపు, కారం, కరకరలాడే రుచి అద్భుతంగా ఉంటుందని ఆమె అభివర్ణించింది. ముఖ్యంగా పాత న్యూస్ పేపర్‌ను కోన్ లాగా చుట్టి అందులో భేల్ ఇచ్చే విధానం చాలా బాగుంటుందని గుర్తు చేసుకుంది. ముంబై వీధుల్లో నిలబడి ఆ భేల్ తింటే వచ్చే మజానే వేరని ఆమె మాటల్లో స్పష్టమైంది.

గతంలో మరో ఇంటర్వ్యూలో తన రోజువారీ ఆహారపు అలవాట్ల గురించి ఆమె ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది. విదేశాల్లో ఉంటున్నప్పటికీ ఆమె మనసు ఎప్పుడూ ఇంటి భోజనం కోసమే తపిస్తుందట. వేడివేడి పప్పు, ఆలూ గోబీ, ఫుల్కాలు అంటే ఆమెకు మహా ఇష్టం. తన మలయాళీ మూలాల కారణంగా చేపల పులుసు, పెరుగన్నం కూడా ఇష్టంగా తింటానని చెప్పింది. ఇక సౌకర్యవంతమైన భోజనం కావాలనుకుంటే ఇడ్లీ, దోశ లేదా పోహా (అటుకుల ఉప్మా)ను ఎంచుకుంటానని తెలిపింది.

Priyanka Chopra And Bhel

Priyanka Chopra And Bhel

వడపావ్ vs హాట్ డాగ్

అయితే, ఒక ఫన్ ఫుడ్ ఛాలెంజ్‌లో ఆమె చేసిన ఎంపిక అభిమానులను ఆశ్చర్యపరిచింది. ముంబైకి ప్రాణమైన ‘వడపావ్’ మరియు అమెరికన్ క్లాసిక్ ‘హాట్ డాగ్’ మధ్య ఒకదాన్ని ఎంచుకోమంటే, ఆమె హాట్ డాగ్‌ను ఎంచుకుంది. ఈ క్లిప్ వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఏదేమైనా, ఒక గ్లోబల్ ఐకాన్‌గా ఉంటూ భారతీయ వీధి ఆహారాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంలో ఆమె ఎప్పుడూ ముందుంటుంది. ఎన్ని దేశాలు తిరిగినా, ఎన్ని ఖరీదైన వంటకాలు తిన్నా మన దేశీ రుచుల ముందు అవేవీ సాటిరావు. ముంబై వెళ్తే ప్రియాంక చెప్పినట్లు ఆ ‘న్యూస్ పేపర్ కోన్’ లో భేల్ తినడం మాత్రం మర్చిపోకండి!

Follow Us