RCB vs LSG: బెంగళూరు బౌలర్ల ధాటిని తేలిపోయిన లక్నో.. ఆర్సీబీ ముందే స్వల్ప లక్ష్యం..!
RCB vs LSG, 23rd Match, IPL 2026: ఐపీఎల్ 2019లో భాగంగా 23వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య జరుగుతోంది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో RCB టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈక్రమంలో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముందు 147 పరుగుల టార్గెట్ నిలిచింది.

Royal Challengers Bengaluru vs Lucknow Super Giants, 23rd Match, Indian Premier League 2026: ఐపీఎల్ 2019లో భాగంగా 23వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య జరుగుతోంది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో RCB టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈక్రమంలో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముందు 147 పరుగుల టార్గెట్ నిలిచింది. 19వ ఓవర్‌లో భువనేశ్వర్ కుమార్ వరుస బంతుల్లో మహమ్మద్ షమీ, జార్జ్ లిండేలను అవుట్ చేసినప్పటికీ, హ్యాట్రిక్ సాధించడంలో విఫలమయ్యాడు.
కాగా, పవర్‌ప్లేలో గాయంతో రిటైర్ అయిన పంత్, 16వ ఓవర్‌లో తిరిగి బ్యాటింగ్‌కు వచ్చి, 17వ ఓవర్‌లో అవుటయ్యాడు.
12వ ఓవర్‌లో, క్రునాల్ పాండ్యా బౌలింగ్‌లో అబ్దుల్ సమద్ కెప్టెన్ రజత్ పాటిదార్ చేతికి క్యాచ్ ఇచ్చాడు. అతను మిచెల్ మార్ష్‌ను కూడా బౌల్డ్ చేశాడు. 7వ ఓవర్‌లో, జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో నికోలస్ పూరన్ (1 పరుగు) అవుటయ్యాడు. ఐడెన్ మార్క్రమ్ (12 పరుగులు) రసిఖ్ సలాం చేతికి క్యాచ్ ఇచ్చాడు.




