Viral: కడుపునొప్పి భరించలేక ఆస్పత్రికి వెళ్లిన మహిళ.. స్కాన్ చేసిన డాక్టర్లకు మైండ్ బ్లాంక్!
ఓ మహిళకు తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. మాములు కడుపునొప్పే కదా అని స్థానికంగా ఉండే ఆర్ఎంపీ డాక్టర్లకు...
ఓ మహిళకు తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. మాములు కడుపునొప్పే కదా అని స్థానికంగా ఉండే ఆర్ఎంపీ డాక్టర్లకు చూపించుకుని కొన్ని మందులు వాడింది. అయితే కడుపు నొప్పి ఎంతకూ తగ్గలేదు. దీనితో చేసేదేమిలేక పెద్దా ఆసుపత్రికి వెళ్లిన ఆమెపై.. అక్కడున్న డాక్టర్లు పలు టెస్టులు నిర్వహించారు. స్కానింగ్ చేసి సదరు మహిళ రిపోర్టులు చూసిన డాక్టర్లకు ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయాయి.
వివరాల్లోకి వెళ్తే.. ఇండోర్‌కు చెందిన 46 ఏళ్ల రజియా అనే మహిళ గత కొద్దిరోజులుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతోంది. ఏదైనా ఫుడ్ పాయిజనింగ్ అయి ఉంటుందిలే అని స్థానికంగా ఉండే ఆర్ఎంపీ డాక్టర్లకు చూపించింది. వాళ్లు రాసి ఇచ్చిన మందులను వాడింది. అయినా కడుపు నొప్పి ఎంతకూ తగ్గకపోవడంతో దగ్గరలోని పెద్దాసుపత్రికి వెళ్లింది రజియా. అక్కడున్న డాక్టర్లు రజియాకు పలు టెస్టులు నిర్వహించారు. అనంతరం వచ్చిన రిపోర్టులు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. వైద్యులు ఆమె కడుపులో హెయిర్ పిన్ ఉన్నట్లు గుర్తించారు.
సదరు మహిళకు ఎండోస్కోపీ సర్జరీ నిర్వహించిన డాక్టర్లు.. అతి కష్టం మీద ఆ హెయిర్ పిన్‌ను ఆమె కడుపు నుంచి తొలగించారు. ప్రస్తుతం రజియా ఆరోగ్యం బాగానే ఉందని.. రెండు రోజులు అబ్జర్వేషన్‌లో ఉంచినట్లు వైద్య నిపుణులు చెప్పారు. ఇంతకీ ఆ హెయిర్ పిన్ అసలు ఎలా మింగిందో ఆమెకే గుర్తులేదని వైద్యులు చెప్పారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..