Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: భోజనంలో పాము తల.. ఖంగుతిన్న విమాన సిబ్బంది.. వీడియో చూస్తే గుండె గుభేల్.. వైరల్ వీడియో

టర్కీ రాజధాని అంకారా నుంచి జర్మనీలోని డ్యూసెల్‌డార్ఫ్‌కు వెళ్తున్న సన్‌ఎక్స్‌ప్రెస్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. ఫుడ్ ప్యాకెట్‌లో పాము తలని చూసిన ఓ విమాన సహాయకురాలు..

Viral Video: భోజనంలో పాము తల.. ఖంగుతిన్న విమాన సిబ్బంది.. వీడియో చూస్తే గుండె గుభేల్.. వైరల్ వీడియో
Snake Viral Video
Follow us
Venkata Chari

|

Updated on: Jul 26, 2022 | 1:12 PM

Viral Video: నెట్టింట్లో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు సందడి చేస్తుంటాయి. ఇవి నెటిజన్లను తెగ ఆకట్టుకుంటాయి. ఇందులో కొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తే, మరికొన్ని షాక్‌కు గురిచేస్తుంటాయి. ఇలాంటి కోవకే చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్టో చక్కర్లు కొడుతోంది. ఫుడ్ ప్యాకెట్‌లో పాము తల కనిపించడంతో ఆకాశంలో ఎగురుతున్న విమానంలోని సిబ్బంది కేకలు వేసినట్లు ఈ వీడియోలో చూడొచ్చు. టర్కీ రాజధాని అంకారా నుంచి జర్మనీలోని డ్యూసెల్‌డార్ఫ్‌కు వెళ్తున్న సన్‌ఎక్స్‌ప్రెస్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. ఫుడ్ ప్యాకెట్‌లో పాము తలని చూసి ఎంతో భయపడ్డానని ఓ విమాన సహాయకురాలు పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెటిజన్లలో చర్చ మొదలైంది.

వైరల్ అవుతున్న వీడియోలో, విమాన సిబ్బంది ఆహార ప్యాకెట్లను చూపిస్తున్నట్లు చూడొచ్చు. వీటిలో ఓ సలాడ్ ప్యాకెట్‌లో కత్తిరించిన పాము తల కనిపించిందని సిబ్బంది పేర్కొన్నారు. వీడియోలోని సలాడ్ ప్యాకెట్‌పై దృష్టి సారిస్తే, అందులో పాము తల చూడొచ్చు.

ఇవి కూడా చదవండి

క్యాబిన్ సిబ్బంది ఆహారంలో పాము తల కనిపించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. ట్విట్టర్‌లో @DidThatHurt2 అనే అకౌంట్‌తో ఈ వీడియోను పంచుకున్నారు. “సన్‌ఎక్స్‌ప్రెస్ విమానంలో ఆహారంలో కత్తిరించిన పాము తల కనిపించింది. ఈ సంఘటన తర్వాత, విమానయాన సంస్థ ఆహార సరఫరా సంస్థపై తక్షణమే చర్య తీసుకుని, కాంట్రాక్టును తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ ఘటన ఆమోదయోగ్యం కాదని విమానయాన సంస్థ పేర్కొంది.” ఇంతకు ముందు ఆహారంలో నత్త కూరుకుపోయిందనే వార్తలు కూడా తెరపైకి వచ్చాయి.

Sancak అనే కంపెనీ SunExpress విమానంలో ఆహార సరఫరా చేస్తుంది. గత నాలుగు సంవత్సరాలుగా ఎయిర్‌లైన్స్ కోసం క్యాటరింగ్ సేవలను అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇలాంటి ఫిర్యాదు అందడం ఇదే తొలిసారి. ఆహారం శాంపిల్‌ను కోరామని, అయితే అది అందలేదని కంపెనీ పేర్కొనడం గమనార్హం.