Viral: వామ్మో.. ఆ చర్చి నిండా ఎముకలు.. ఆస్తిపంజరాలే.. భయపడేవాళ్లు చూడొద్దు.!

భయం, భక్తి మనిషితో ఏమైనా చేయిస్తాయి. ఈ రెండిటి మేళవింపుతోనే ఓ అద్భుత కళాఖండం రూపుదిద్దుకుంది...

Viral: వామ్మో.. ఆ చర్చి నిండా ఎముకలు.. ఆస్తిపంజరాలే.. భయపడేవాళ్లు చూడొద్దు.!
Church
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 26, 2022 | 1:30 PM

భయం, భక్తి మనిషితో ఏమైనా చేయిస్తాయి. ఈ రెండిటి మేళవింపుతోనే ఓ అద్భుత కళాఖండం రూపుదిద్దుకుంది. అదే ఓస్కూరీ రోమన్‌ క్యాథలిక్‌ చర్చ్‌. ఇందులోకి అడుగు పెట్టగానే వేలాది అస్తిపంజరాలు స్వాగతం పలుకుతాయి. యూరప్‌ దేశమైన చెక్‌ రిపబ్లిక్‌ కుట్నాహోరాలోని సెడ్లెక్‌లోఈ చర్చ్‌ ఓ ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారింది.

1278లో సెడ్లెక్‌లోని సిస్టెర్సియన్‌ మఠాధిపతి హెన్రీని.. బొహీమియా రాజు ఒటాకర్‌ 2.. గోల్గోతా కు పంపాడు. గోల్గోతా అంటే.. సువార్తతో ఏసు శిలువ వేయబడిన స్థలం. అక్కడ నుంచి కొద్దిపాటి మట్టిని తీసుకొచ్చిన హెన్రీ.. సెడ్లెక్‌లోని అబ్బే శ్మశానవాటికపై చల్లాడు. అప్పటినుంచి అది పవిత్రస్థలంగా మారింది. దీంతో స్థానికులు.. చనిపోయిన తమవారిని అక్కడే ఖననం చేయడం సంప్రదాయంగా మారింది. 14వ శతాబ్దం వరకు ఈ సంప్రదాయం కొనసాగింది. ఆ సమయంలోనే యూరోప్‌ అంతా ప్లేగు ప్రబలింది.

Church 3

 

ఆ వ్యాధికి 30వేల మంది పైనే మృతి చెందారు. ఆ తర్వాత మతయుద్ధాలతో మరో పదివేల మంది చనిపోయారు. 1870లో అక్కడ చర్చి నిర్మాణం కోసం.. పాతిపెట్టిన శవాలను తవ్వడంతో పాటు.. చనిపోయిన వారి ఎముకలు, పుర్రెలతో చర్చి లోపల అలంకరణ చెయ్యాలని నిర్ణయించారు. అందులో భాగంగానే నాటి స్థానిక శిల్పులు.. ఈ అద్భుత కళాఖండాన్ని నిర్మించారు. ఆ చిన్న చర్చిలో.. అస్థిపంజరాలు ఎన్నో రూపాల్లో పర్యాటకులను ఆకట్టుకుంటాయి. దాంతో ఈ చర్చికి ‘బోన్‌ చర్చ్‌’ అనే పేరు వచ్చింది.

ఇవి కూడా చదవండి
Church1

 

Church 2

 

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం.

42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..