Viral: యువతితో మాటలు కలిపాడు.. కొద్దిసేపటికి అదృశ్యమయ్యాడు.. కట్ చేస్తే ఊహించని ట్విస్ట్!
ఓ యువతి తన ఇంటికి దగ్గరలోని బ్యాంక్‌కు డబ్బులు విత్‌డ్రా చేసేందుకు వెళ్లింది. విత్ డ్రా ఫామ్ తీసుకుని రాస్తుండగా..
ఓ యువతి తన ఇంటికి దగ్గరలోని బ్యాంక్‌కు డబ్బులు విత్‌డ్రా చేసేందుకు వెళ్లింది. విత్ డ్రా ఫామ్ తీసుకుని రాస్తుండగా.. ఓ వ్యక్తి డబ్బు లావాదేవీలకు సంబంధించిన సందేహాలు నివృత్తి చేస్తానంటూ మాటలు కలిపాడు. కట్ చేస్తే కొద్దిసేపటికి అదృశ్యమయ్యాడు. ఇక ఆ తర్వాత ఇంటికెళ్ళిన ఆమె తన పాస్ బుక్ చూసుకోగా దెబ్బకు ఫ్యూజులు ఎగిరాయి. ఆ కథేంటంటే.!
చిన్న సందు దొరికితే చాలు.. అమాయకులను మోసం చేసేందుకు నేరగాళ్లు పొంచి ఉంటున్నారు. మనం ఆదమరిస్తే.. పాకెట్‌కు తెలియకుండానే మనీ కొట్టేస్తారు. కొందరు ఆన్‌లైన్ మోసాలు చేస్తుంటే.. మరికొందరు బ్యాంకులు, ఏటీఎంల దగ్గర కాపుకాసి.. మాయమాటల ద్వారా అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి హర్యానాలో చోటు చేసుకుంది.
పానిపట్‌లోని మోడల్ టౌన్‌లో నివాసముంటున్న ఓ యువతి.. చిన్న లావాదేవీ విషయమై స్థానిక బ్యాంక్‌కు వెళ్లింది. అక్కడ ఒకతడు ఆమెకు పరిచయమయ్యాడు. నగదు లావాదేవీలకు సంబంధించిన సందేహాలు నివృత్తి చేస్తానంటూ ఆమె దగ్గర చెక్‌బుక్ తీసుకున్నాడు. కట్ చేస్తే కొద్దిసేపట్లో అదృశ్యమయ్యాడు. అసలేం జరిగిందో తెలియని ఈ యువతి.. తన బ్యాంక్ పాస్‌బుక్ అప్‌డేట్ చేసుకుని ఇంటికి చేరుకుంది. అకౌంట్‌లో డబ్బులు ఎంత ఉన్నాయో చూసుకోగా.. కొద్దిసేపటి క్రితం రూ. 50 వేలు డ్రా అయినట్లు కనిపిస్తుంది. దీబకు ఆమె ఫ్యూజులౌట్.
వెంటనే బ్యాంక్‌కు వెళ్లి ఎంక్వయిరీ చేయగా.. గంట క్రితం ఓ వ్యక్తి వచ్చి డబ్బులు విత్‌డ్రా చేశాడని సిబ్బంది చెప్పారు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన ఆమె పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కాగా, కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం.