Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vishnu Vishal: నగ్నంగా భర్తను ఫోటోలు తీసిన గుత్తా జ్వాల.. ఇదేం ట్రెండ్ అంటూ నెటిజన్ల ఫైర్..

యితే తాజాగా ఈ హీరో ఉన్నట్టుండి న్యూడ్ ట్రెండ్‌ను ఫాలో అవ్వాలని అనుకున్నాడట. అనుకోవడమే కాదు.. Well... joining the trend ! అనే క్యాప్షన్తో తన న్యూడ్‌ పిక్స్‌ను తన ట్విట్టర్‌ అకౌంట్లో షేర్ చేశారు.

Vishnu Vishal: నగ్నంగా భర్తను ఫోటోలు తీసిన గుత్తా జ్వాల.. ఇదేం ట్రెండ్ అంటూ నెటిజన్ల ఫైర్..
Gutta Jwala Clicks Photo Of Her Husband
Follow us
Venkata Chari

|

Updated on: Jul 25, 2022 | 12:28 PM

హీరోలకు కాస్తో కూస్తో బాడీ ఉంటే ఏం చేసేవారు.. మా అంటే సినిమాల్లో షర్టు విప్పి తమ కండలను చూంపిచేవారు.. తమ ఫ్యాన్స్ ను ఖుషీ చేసేవారు. అయితే ఇదంతా.. అప్పట్లో.! కానీ, ఇప్పుడు మాత్రం సినిమాలతో పనిలేకుండా.. బట్టలిప్పేసి బరబాత ఫోటోలు తీయించుకుంటున్నారు. దాన్నో ట్రెండ్‌గా మార్చేస్తున్నారు. ఇవి కాస్త నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి క్రేజీ పని చేసి ఇంటర్నెట్‌ను షేక్ చేసిన రణ్ వీర్ సింగ్‌ను మరవక ముందే.. మరో హీరో.. తన న్యూడ్ ఫోటోలతో నెటిజన్ల మైండ్‌ బ్లాక్ చేశారు. ఆయన ఎవరో కాదు.. విష్ణు విశాల్.

ఎట్ ప్రజెంట్ కోలీవుడ్‌లో వర్సటైల్‌ సినిమాలు చేస్తూ.. మంచి పేరు సంసాదించుకున్న ఈ హీరో.. ఇటీవల మన హైదరాబాదీ, బ్యాండ్మెంటన్ ప్లేయర్ గుత్తా జ్వాలను ప్రేమించి పెళ్లి కూడా చేసుకున్నాడు. అటు ఫిల్మ్ కెరీర్‌లోనూ..ఇటు మ్యారీడ్‌ లైఫ్‌లోనూ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి

అయితే తాజాగా ఈ హీరో ఉన్నట్టుండి న్యూడ్ ట్రెండ్‌ను ఫాలో అవ్వాలని అనుకున్నాడట. అనుకోవడమే కాదు.. Well… joining the trend ! అనే క్యాప్షన్తో తన న్యూడ్‌ పిక్స్‌ను తన ట్విట్టర్‌ అకౌంట్లో షేర్ చేశారు. షేర్ చేయడమేకాదు.. తన వైఫ్ గుత్తా జ్వాల ఈ న్యూడ్‌ ఫోటోలను క్లిక్ చేశారని చెబుతూ అందర్నీ షాక్ చేశారు. దీంతో వీరు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నారు.