Health Tips: వర్షాకాలంలో దేశీ నెయ్యితో వీటిని తీసుకుంటే.. ఆ ఇబ్బందులు మటుమాయం..

నల్ల మిరియాలు, నెయ్యి తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వాస్తవానికి, నల్ల మిరియాలు విటమిన్లు, యాంటీ-ఆక్సిడెంట్ల లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి అనేక రకాల ఆరోగ్య సమస్యలను తొలగించడంలో ప్రభావవంతంగా ఉంటాయి.

Health Tips: వర్షాకాలంలో దేశీ నెయ్యితో వీటిని తీసుకుంటే.. ఆ ఇబ్బందులు మటుమాయం..
Black Pepper With Ghee Benefits
Follow us
Venkata Chari

|

Updated on: Jul 28, 2022 | 11:01 AM

నల్ల మిరియాలు చిన్నగా ఉన్నప్పటికీ, ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. నల్ల మిరియాలు విటమిన్ సి, విటమిన్ ఎ, ఫ్లేవనాయిడ్లు, కెరోటిన్, ఇతర యాంటీ-ఆక్సిడెంట్ల వంటి లక్షణాలను కలిగి ఉంటాయి. దీంతో నల్ల మిరియాలు ఆరోగ్యంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంటాయి. నల్ల మిరియాలు తీసుకోవడం వల్ల క్యాన్సర్‌ను నిరోధించే ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. నల్ల మిరియాలను నెయ్యితో కలిపి తీసుకుంటే, ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఆ లాభాలేంటో ఓసారి చూద్దాం..

పొడి దగ్గు నుంచి ఉపశమనం..

నల్ల మిరియాలను తీసుకోవడం వల్ల పొడి దగ్గు నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి, 1/2 టీస్పూన్ నల్ల మిరియాలు ఒక టీస్పూన్ దేశీ నెయ్యితో కలిపి తీసుకోవాలి. నల్ల మిరియాలు వేడిని తగ్గిస్తుంది. తద్వారా దగ్గు నుంచి ఉపశమనం పొందేలా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

నెయ్యితో మిరియాలను కలిపి తింటే రోగ నిరోధక శక్తి బలపడుతుంది. నల్ల మిరియాలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఇటువంటి పరిస్థితిలో, జలుబు, దగ్గు వంటి సమస్యలు ఉంటే, నల్ల మిరియాల పొడిని నెయ్యిలో కలిపి తింటే మేలు జరుగుతుంది.

కంటి చూపును పెంపొందించడంలో..

కంటి చూపు బలహీనంగా ఉన్నవారికి కూడా నల్ల మిరియాలు తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. దీని కోసం, కొన్ని చుక్కల దేశీ నెయ్యిలో నల్ల మిరియాల పొడిని కలపండి. ప్రతిరోజూ తినండి. కావాలంటే, అరికాళ్ళకు కూడా దీనిని రాసుకోవచ్చు. ఇది తక్కువ కంటి చూపు ఉన్నవారికి కూడా మేలు చేస్తుంది.

కీళ్ల నొప్పుల నివారణకు..

వృద్ధాప్యంలో తరచుగా కీళ్ల నొప్పుల వస్తుంటుంది. కీళ్ల నొప్పుల నుంచి తేరుకోవాలంటే నెయ్యి, నల్లమిరియాలు సేవిస్తే ఉపశమనం లభిస్తుంది. ఇందుకోసం మిరియాలను వేయించి నెయ్యితో తీసుకోవాలి. ఈ మిశ్రమం చక్కెర స్థాయిని అదుపులో ఉంచడంలోనూ సహాయపడుతుంది.

గమనిక: ఈ కథనంలోని పేర్కొన్న చిట్కాలు, సలహాలు సాధారణ సమాచారం కోసం మాత్రమే. వైద్య సలహాగా భావించకూడదు. ఇలాంటివి పాటించే ముందు దయచేసి వైద్యుడిని సంప్రదించి, తగిన సలహాలు తీసుకుంటే మంచిది.