- Telugu News Photo Gallery World hepatitis day 2022 here are some best tips to avoid liver damage from hepatitis b in Telugu
World Hepatitis Day 2022: కాలేయాన్ని కాపాడుకోవాలంటే ఈ సూపర్‌ఫుడ్స్ తినాల్సిందే.. లిస్టులో ఏమేం ఉన్నాయంటే?
World Hepatitis Day 2022: హెపటైటిస్ లో రెండు రకాలు ఉన్నాయి. అందులో హెపటైటిస్- B చాలా ప్రమాదకరం. దీని కారణంగా కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉంది. కాగా నేడు (జులై 28) ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం. ఈ సందర్భంగా హైపటైటిస్ వ్యాధి నుండి రక్షణ పొందేందుకు,
Updated on: Jul 28, 2022 | 6:09 PM

హెపటైటిస్ లో రెండు రకాలు ఉన్నాయి. అందులో హెపటైటిస్- B చాలా ప్రమాదకరం. దీని కారణంగా కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉంది. కాగా నేడు (జులై 28) ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం. ఈ సందర్భంగా హైపటైటిస్ వ్యాధి నుండి రక్షణ పొందేందుకు, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడే కొన్ని సూపర్ ఫుడ్ గురించి తెలుసుకుందాం.

ద్రవ పదార్థాలు: శరీరం హైడ్రేట్ గా ఉంటే, హెపటైటిస్ వంటి అనేక వ్యాధులు దూరంగా ఉంటాయి. ఇందుకోసం రోజూ 3 నుంచి 4 లీటర్ల నీరు తాగాలి. అలాగే సూప్‌లు కొబ్బరి నీళ్లు బాగా తీసుకోవాలి.

రోగ్యంగా ఉండేందుకు రోజూ పండ్లు, కూరగాయలు తినాలి. వీటిని తీసుకోవడం వల్ల పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. దీనితో పాటు, మన రోగనిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది.

శరీరంలో సిర్రోసిస్ సమస్య ఉంటే, ప్రొటీన్ ఫుడ్స్ బాగా తినాలి. పాలు, పెరుగు, జున్ను తదితర ఫుడ్స్‌ను బాగా తీసుకోవాలి.

చపాతీలు మన రొటీన్ ఫుడ్స్‌లో ఒకటి. అయితే అవి మలబద్ధకాన్ని కూడా కలిగిస్తాయి. బదులుగా బార్లీ వంటి ఫైబర్ ఫుడ్స్‌ను బాగా తీసుకోవచ్చు. ఇవి మీ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. పలు వ్యాధులను దూరం చేస్తాయి.





























