- Telugu News Photo Gallery Spiritual photos Chanakya niti in telugu: these 4 situations force a person to live a life of suffocation
Chanakya Niti: మగవాడి జీవితాన్ని ఈ 4 పరిస్థితులు విచారంగా మారుస్తాయంటున్న ఆచార్య చాణక్య
Chanakya Niti: ప్రతి వ్యక్తి జీవితంలో ఆనందం , విచారాలు సర్వసాధారణం. అయితే ఎవరైనా విచారంలో చిక్కుకుంటే అతను జీవితాన్ని గడపడం కష్టంగా మారుతుంది. అటువంటి కొన్ని పరిస్థితులు ఆచార్య చాణక్య నీతిలో వివరించారు.
Updated on: Jul 28, 2022 | 1:12 PM

చాలా సార్లు.. ఎంత కష్టపడి పని చేసినా ఏ పనిలోనూ విజయం సాధించలేము. పని ఒత్తిడి ఉంటే.. మనకు ఇష్టమైన వారిని కూడా దూరంగా ఉంచుతాం. అయితే ఎంత కష్టపడినా జీవితంలో మనం ఏమీ సాధించలేకపోతున్నాం అనుకునేవారు ఆచార్య చాణక్యుడు చెప్పిన కొన్ని విషయాలను గుర్తుంచుకోండి. కొన్ని జంతువుల లక్షణాల నుంచి నేర్చుకోవడం ద్వారా.. వ్యక్తి జీవితంలో విజయం సాధించగలడు.

స్త్రీలు, పురుషులు తమ భాగస్వామి అందంగా కనిపించాలని కోరుకుంటారనేది నిజం. అయితే చాలా మంది మహిళలు పురుషుల వ్యక్తిత్వంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ఒక వ్యక్తి మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటే.. అతని గొప్ప గుణమని నిరూపించవచ్చు. స్త్రీలు అత్యాశ లేదా అహంకార ధోరణులను కలిగి ఉన్న పురుషుల నుండి దూరంగా ఉండటానికి ఇష్టపడతారు. మహిళలు నిజాయితీగా, విధేయతతో ఉన్నవారిని ఇష్టపడతారు. అటువంటి వారిని జీవిత భాగస్వామిగా కోరుకుంటారు.

అసూయ: కోపంలా అసూయ కూడా మనిషికి అతి పెద్ద శత్రువు అని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. అసూయ మనిషిని ముందుకు సాగనివ్వదు. అసూయపడే వ్యక్తి ఎప్పుడూ తనతో పాటు, ఇతరుల విజయానికి కూడా అడ్డుగా ఉంటాడు.

ఎండిన తులసి మొక్క: ఇంటి ఆవరణలో ఉంచిన తులసి మొక్క ఎండిపోవడం అశుభానికి సంకేతంగా పరిగణిస్తారు. అలా ఎండిన తులసి మొక్క ఉన్న కుటుంబంలో లేదా ఇల్లు అసమ్మతిని లేదా గొడవలను ఎదుర్కోవలసి పరిస్థితులు ఏర్పడొచ్చని చాణక్య నీతి చెబుతోంది. అటువంటి తులసి మొక్కతో అనుబంధాన్ని కలిగి ఉండకుండా.. దానిని గౌరవంగా ఇంటి నుంచి తీసివేయాల్సి ఉంటుంది.

మత్తు వంటి అలవాటుకు యువత దూరంగా ఉండాలి. మత్తు కారణంగా మనిషి శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా బలహీనుడవుతాడు. దీంతో ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యసనాలు యువత వర్తమానాన్ని, భవిష్యత్తును పాడుచేస్తాయి.





























