Viral Video: వీడు మామూలోడు కాదుగా.. పెట్రోల్ కోసం బైక్ ఫ్యూయల్ ట్యాంక్‌తో వచ్చాడు..
ఓ ఫన్నీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సైకిల్‌పై పెట్రోల్ ట్యాంక్‌ని తీసుకొచ్చిన బాలుడిని చూడవచ్చు. బాటిల్స్‌లో పెట్రోల్ పోయడాన్ని నిలిపివేయడంతో..
పెట్రోలు క్రైమ్ కేసులు పెరిగిపోతుండటంతో అధికారులు కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. సీసాలు లేదా క్యాన్లలో పెట్రోల్ విక్రయించవద్దని నేరుగా వాహనంలోనే ఫిల్ చేయాలని ఆదేశించారు. దీంతో ఈ రూల్ తర్వాత చాలా మందికి పెద్ద సమస్య వచ్చి పడింది. దీంతో పెట్రోల్ బంక్ యాజమాన్యలు కేవలం వాహనాల్లో మాత్రమే పెట్రోల్ నింపుతున్నారు. అయితే ఇలాంటి సమయంలో ఓ చిన్నోడు చేసిన ఓ టెక్నిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ట్విట్టర్ వినియోగదారు రాజీవ్ చోప్రా ఇటీవల ఒక వీడియోను రీట్వీట్ చేసారు. దీనిలో ఒక యువకుడు సైకిల్‌పై పెట్రోల్ నింపించుకునేందుకు పెట్రోల్ పంపు వద్దకు వచ్చాడు. దానిలో పెట్రోల్ నింపించుకున్నాడు.
అసల ఈ ఫన్నీ ఘటనను గుర్చి తెలుసుకుందాం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో సైకిల్ వెనుక పెట్రోల్ ట్యాంక్‌తో వచ్చిన బాలుడిని చూడవచ్చు. ఈ పిల్లాడు బైక్‌లోని పెట్రోల్ ట్యాంక్‌ను సైకిల్ వెనుక ఉంచి ఆయిల్‌తో ఫిల్ చేయించుకున్నాడు. బాటిల్స్ వద్దంటే ఏంకంగా బండి పెంట్రోల్ ట్యాంక్ తీసుకొచ్చాడు. ఇది తెలివంటే.. అంటున్నారు నెటిజన్లు.
వైరల్ అవుతున్న వీడియో
ఈ వీడియోను రాజీవ్ చోప్రా అనే వినియోగదారు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. వీడియో క్యాప్షన్ – ‘రెండు బాటిళ్లలో ఇక పెట్రోల్ .’ జూలై 29న షేర్ చేసిన ఈ వీడియోకి ఇప్పటివరకు 81 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. 3 వేల మందికి పైగా ట్విట్టర్ వినియోగదారులు ఈ వీడియోను లైక్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..