CWG 2022: బర్మింగ్‌హామ్ గేమ్స్‌లో ‘లేడీ సచిన్’.. తొలి విజయంతోనే టాక్ ఆఫ్ ది టౌన్.. ఎవరో తెలుసా?
అనాహత సింగ్ కామన్వెల్త్ గేమ్స్‌లో తన మొదటి మ్యాచ్‌లో జాడా రాస్‌పై గెలిచింది. CWG 2022లో ఆడిన భారతదేశపు అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది.
గతంలో సచిన్ టెండూల్కర్ విషయంలోనూ ఇదే చర్చ జరిగింది. అతి చిన్న వయసులో టీమ్‌లోకి తీసుకోవాలా వద్దా అంటూ తీవ్ర తర్జనభర్జనలు జరిగాయి. అనాహత సింగ్‌పై నిర్ణయం కోసం, సెలెక్టర్లు కూడా ఇలాంటి రిస్క్ లోనే చిక్కుకున్నారు. బర్మింగ్‌హామ్‌లో ప్రారంభమైన కామన్వెల్త్ క్రీడలకు స్క్వాష్ జట్టును ఎంపిక చేస్తున్నప్పుడు, ఢిల్లీకి చెందిన అనాహత సింగ్ వయస్సు కేవలం 13 సంవత్సరాలుగా తేలింది. దీంతో ఆమెను ఎంచుకోవాలా వద్దా అంటూ సందిగ్ధంలో పడ్డారు. ఆమె చురుకుదనం, వేగవంతమైన ఆట సెలెక్టర్లను మాత్రం ఓ మాయలో పడేసింది. అనాహత తన మొదటి మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా పతకం కోసం తన వాదనను ప్రదర్శించింది.
ఆశ్చర్యపడిన మాజీ ప్రపంచ నంబర్ వన్..
ఈ క్రీడలకు ముందు చెన్నైలో క్యాంపు నిర్వహించారు. ఇందులో నేషనల్ స్క్వాష్ అసోసియేషన్ మాజీ నంబర్ వన్ గ్రెగరీ గుల్టియర్‌ను పిలిపించారు. 9వ తరగతి విద్యార్థి అనాహత గ్రెగొరీ ముందు 15 నిమిషాలు మాత్రమే ఆడింది. ఒక ప్రొఫెషనల్ స్క్వాష్ ఆటగాడు తన ముందు ఉన్నాడని గ్రెగొరీ భావించింది. ఇంత చిన్న వయస్సులో అనాహత ఈ సంక్లిష్టమైన ఆట సూక్ష్మ నైపుణ్యాలను ఎలా అర్థం చేసుకుందో తెలిసి ఆమె ఆశ్చర్యపోయింది.!
బర్మింగ్‌హామ్ గేమ్స్‌లో దేశంలోని అతి పిన్న వయస్కురాలిగా గుర్తింపు..
శుక్రవారం జరిగిన బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో సింగిల్స్ ఆడిన అనాహత తన తొలి మ్యాచ్‌లో 11-5, 11-2, 11-0తో సెయింట్ విసెంటె అండ్ గ్రెనేడియన్స్‌కు చెందిన జాడా రోస్‌పై గెలిచింది. ప్రస్తుతం, 14 ఏళ్ల అనాహత ఈ క్రీడలలో భారతదేశపు అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచింది. కానీ ఆమె చాలా తక్కువ వ్యవధిలో సుదీర్ఘ ప్రయాణం యువ ఆటగాళ్లకు మాత్రమే కాకుండా సామాన్యులకు కూడా ఎలాంటి క్రీడలతో సంబంధం లేకుండా ఏం చేయాలో నేర్పడంలో సహాయపడుతుంది.
భారతదేశం, ఆసియాలో అండర్-15 విభాగంలో అగ్రస్థానంలో నిలిచిన అనాహతా సక్సెస్ చార్ట్‌లను పరిశీలిస్తే, ఆమె అసాధారణమైన ప్రతిభను చూపుతుంది. ప్రారంభ దశలో ఆమెకు కోచ్ లేరు. ఆమె తన అక్కతో పాటు సిరి ఫోర్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు వెళ్లేది. అక్కడ 10-15 నిమిషాలు ఆడి ఇంటికి తిరిగొచ్చారు. ఆపై తన సోదరిని ప్రోత్సహించిన తర్వాత, అనాహత రాకెట్‌ను మరింత సీరియస్‌గా తీసుకోవడం ప్రారంభించింది. గత సంవత్సరం వరకు, ఆమె జూనియర్ సర్క్యూట్‌లో తన సత్తా చూపించింది. ఆమె ఆట సెలక్టర్ల దృష్టిని ఆకర్షించింది. సీనియర్ ఆటగాళ్లు కూడా వయస్సుపై ప్రశ్నలు లేవనెత్తారు. కానీ, అనాహత ఆటను చూసిన తర్వాత, ప్రతి ఒక్కరిలో విశ్వాసం బలపడింది. అయితే, కామన్వెల్త్ గేమ్స్‌కు జట్టులో ఎంపిక వార్త అనాహతనే ఆశ్చర్యపరిచింది.
ఈ క్రీడల కోసం చెన్నైలోని నేషనల్ క్యాంప్‌లో జోష్నా చిన్నపా, దీపికా పల్లికల్‌ల ముందు ఆమె ఉన్నారు. అనాహత వయసు, పొట్టితనాన్ని చూసిన వారిద్దరి మదిలో ఎన్నో ప్రశ్నలు వచ్చాయి. కానీ ఆమె వారితో ప్రాక్టీస్ చేయడం ప్రారంభించగానే, ఆమె ఏన్నో ఏళ్ల అనుభవం ఉన్న ప్లేయర్‌గా తన సత్తా చూపించింది. బర్మింగ్‌హామ్ గేమ్‌లకు వెళ్లే ముందు, ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్‌లతో ప్రాక్టీస్ చేయడం అనాహత గేమ్‌ను మరింత బలోపేతం చేయడంలో ఉపయోగపడింది.
మ్యాచ్‌లో అనాహత తప్పులు చేయదు..
అనాహత తిరుగులేని ప్లేయర్ అనడంలో సందేహం లేదు. అయితే ఈ వయసులో సీనియర్ లేబుల్ మనస్తత్వం ఎవరికీ అంత ఈజీ కాదు. ఆమె ఆటలోని సానుకూల అంశం ఏమిటంటే, ప్రతి ప్రాక్టీస్ సెషన్, మ్యాచ్‌లో ఆమె మరింత ఎక్కువగా నేర్చుకోవాలనుకుంటోంది. అనాహతా కోచ్ రిత్విక్ భట్టాచార్య మాట్లాడుతూ.. మ్యాచ్‌లో ఆమె ఎలాంటి తప్పు చేయలేదని చెప్పుకొచ్చాడు. ఇది ఆమె ఆటలో బలమైన అంశం. సహజంగానే ఈ చిన్న అనాహత గురించి ఎందుకు మాట్లాడుతున్నారో ఇప్పుడు అర్థమైందనుకుంటా..
చిన్న వయసులోనే సక్సెస్‌ని చూసినా..
బర్మింగ్‌హామ్ గేమ్స్‌లో పతకం ఖచ్చితంగా ఆమె ఆటను మారుస్తుంది. ఇంత చిన్న వయసులోనే విజయాన్ని తాకింది. అనాహతాకు ఆసియా జూనియర్ ఛాంపియన్‌షిప్‌లు, యూఎస్ జూనియర్ ఓపెన్‌లలో పతకాలు ఉన్నాయి. ఇంతకు ముందు ఏ భారతీయుడు ఈ టైటిల్‌ను గెలుచుకోలేదు. ఇది కాకుండా బ్రిటీష్ ఓపెన్‌లో 2019లో బంగారు పతకం, ఆ ఏడాది రజత పతకం కూడా అనాహత పేరిట ఉన్నాయి. ఈ గేమ్స్‌లో ఆమె సాధించిన పతకం దేశంలో నడుస్తున్న స్క్వాష్ అకాడమీలలో యువ ఆటగాళ్ల నమోదును పెంచుతుంది. సైనా నెహ్వాల్, సానియా మీర్జాల విజయం లాగానే,ఈమె కూడా యువ ఆటగాళ్లకు ఎంతో స్ఫూర్తినిస్తుంది.