Stock Market: షేర్లు ఒక్కటే కాదు స్టాక్ మార్కెట్లో జరిగే ఇతర వ్యాపారాల గురించి తెలుసా?

Trading: పెట్టుబడిదారులు తమ కార్పస్‌ను సంపాదించడానికి తమ డబ్బును స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడతారు. కొంత మంది ఇన్వెస్టర్లు దీర్ఘకాలికంగా, మరికొందరు స్వల్పకాలానికి ఇన్వెస్ట్ చేస్తారు.

Stock Market: షేర్లు ఒక్కటే కాదు స్టాక్ మార్కెట్లో జరిగే ఇతర వ్యాపారాల గురించి తెలుసా?
Stock Market
Follow us
Basha Shek

| Edited By: Anil kumar poka

Updated on: Sep 16, 2022 | 3:29 PM

Trading: పెట్టుబడిదారులు తమ కార్పస్‌ను సంపాదించడానికి తమ డబ్బును స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడతారు. కొంత మంది ఇన్వెస్టర్లు దీర్ఘకాలికంగా, మరికొందరు స్వల్పకాలానికి ఇన్వెస్ట్ చేస్తారు. సాధారణంగా మనం స్టాక్ మార్కెట్ అంటే షేర్లు అమ్మడం కొనడం వంటి కార్యకలాపాలు మాత్రమే జరుగుతాయని భావిస్తాం. అయితే స్టాక్ మార్కెట్ షేర్లకు మాత్రమే పరిమితం కాదు. ఇక్కడ ఇతర ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఆర్థిక సాధనాల లావాదేవీలు కూడా జరుగుతాయి. ఇవి కూడా ఇన్వెస్టర్స్ కు గణనీయమైన రాబడిని అందిస్తాయి. ఇప్పుడు మనం ఇలా స్టాక్ మార్కెట్లో ఎటువంటి ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ పై ట్రేడింగ్ జరుగుతుందో తెలుసుకుందాం.

షేర్లు

షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజ్ లో అత్యంత ప్రజాదరణ పొందిన ఆర్థిక ఉత్పత్తి. మీరు ఒక కంపెనీ షేర్లను కొంటున్నారూ అంటే మీరు వాస్తవానికి ఆ కంపెనీలో పాక్షిక వాటాను తీసుకొని కంపెనీకి వాటాదారుగా మారుతున్నారని అర్థం. షేర్ ధరలు ప్రతి క్షణం మారుతూ ఉంటాయి. మీరు పెట్టుబడి పెట్టిన సొమ్ము పై లాభనష్టాలు ఈ హెచ్చుతగ్గుల ద్వారా నిర్ణయం అవుతాయి.

ఇవి కూడా చదవండి

డెరివేటివ్స్

డెరివేటివ్ అనేది రెండు పార్టీల మధ్య ఒప్పందం. డెరివేటివ్‌లలో, పెట్టుబడిదారు ఒక నిర్దిష్ట రోజున అలాగే నిర్దిష్ట రేటుతో ఆస్తిని కొనుగోలు చేయడానికి లేదా విక్రయించడానికి ఒప్పందం చేసుకుంటాడు. ఈ ఆస్తిలో షేర్లు, కరెన్సీలు, వస్తువులు మొదలైనవి ఉంటాయి. డెరివేటివ్‌లు బంగారం అలాగే ఆయిల్ వంటి వాటి కోసం కూడా ఉపయోగపడతాయి. ప్రాథమికంగా నాలుగు రకాల డెరివేటివ్స్ ఉన్నాయి. ఫ్యూచర్స్ (ఫ్యూచర్స్ ట్రేడింగ్), ఆప్షన్స్, ఫార్వార్డ్‌లు అలాగే స్వాప్‌లు అనేవి ఆ నాలుగు రకాలు. డెరివేటివ్స్ ట్రేడ్ గురించి మరింత తెలుసుకోవడానికి 5paisa.com, https://bit.ly/3RreGqOకి వెళ్లండి. ఇక్కడ మీరు డెరివేటివ్ ట్రేడింగ్ కోసం బహుళ ఉత్పత్తి ఆఫర్‌లను తెలుసుకోవచ్చు

మ్యూచువల్ ఫండ్స్

మ్యూచువల్ ఫండ్‌లు ఈక్విటీలు, మనీ మార్కెట్‌లు, బాండ్‌లు అలాగే ఇతర ఆర్థిక సాధనాల వంటి వివిధ ఆస్తులలో బహుళ పెట్టుబడిదారుల నుంచి డబ్బును సేకరించడం ద్వారా డబ్బును పెట్టుబడి పెడతాయి. వీటిని మీ పోర్ట్‌ఫోలియో ఫండ్ మేనేజర్ నిర్వహిస్తారు. దీని పని పెట్టుబడిదారులకు అధిక రాబడిని అందించడం. మ్యూచువల్ ఫండ్స్ కొత్త పెట్టుబడిదారులకు, స్టాక్ మార్కెట్ గురించి తక్కువ అవగాహన ఉన్నవారికి మంచి ఎంపిక.

బాండ్స్

ప్రభుత్వం లేదా కంపెనీలు డబ్బును సేకరించేందుకు బాండ్లను జారీ చేస్తాయి. నిజానికి, ఒక బాండ్‌ను కొనుగోలు చేయడం ద్వారా, మీరు ఒక విధంగా ఆ బాండ్ జారీ చేసేవారికి రుణం ఇస్తున్నారని చెప్పవచ్చు. ఈ రుణం కోసం బాండ్ జారీ చేసేవారు మీకు వడ్డీని చెల్లిస్తారు. బాండ్లు పెట్టుబడిదారులకు స్థిరమైన వడ్డీ రేటును అందిస్తాయి. కాబట్టి అవి సురక్షితమైన పెట్టుబడి ఎంపికగా చెప్పవచ్చు. స్థిర ఆదాయం కారణంగా బాండ్లను స్థిర ఆదాయ సెక్యూరిటీలు అని కూడా పిలుస్తారు.

కరెన్సీ

కరెన్సీలను కరెన్సీ మార్కెట్ అంటే ఫారెక్స్ మార్కెట్‌లో కొనుగోలు చేసి విక్రయిస్తారు. కరెన్సీ ట్రేడింగ్‌లో బ్యాంకులు, కంపెనీలు, సెంట్రల్ బ్యాంకులు (భారతదేశంలో RBI వంటివి), పెట్టుబడి నిర్వహణ సంస్థలు, బ్రోకర్లు అలాగే సాధారణ పెట్టుబడిదారులు ఉంటారు. కరెన్సీ ట్రేడింగ్‌లో, లావాదేవీలు ఎప్పుడూ జంటగా జరుగుతాయి. ఉదాహరణకు, USD/INR రేటు అంటే ఒక US డాలర్‌ను కొనుగోలు చేయడానికి ఎన్ని రూపాయలు పడుతుంది. మీరు BSE, NSE లేదా MCX-SX వంటి ఎక్స్ఛేంజీల ద్వారా కరెన్సీని వర్తకం చేయవచ్చు.

కమోడీటీస్

కమోడీటీస్ లలో వ్యవసాయ ఉత్పత్తులు, ఎనర్జీ, మెటల్స్ వంటి రోజువారీ వస్తువుల వ్యాపారం ఉంటుంది. వస్తువులలో పెట్టుబడి పెట్టడానికి ఫ్యూచర్స్ ఒప్పందాలు ఉత్తమ మార్గం. ఇవి భవిష్యత్ తేదీలో నిర్దిష్ట ధరకు వస్తువుల కొనుగోలు లేదా విక్రయాలను సులభతరం చేసే ఒప్పందాలుగా ఉంటాయి. అనుభవం లేని పెట్టుబడిదారులకు కమోడీటీస్ వ్యాపారం ప్రమాదకరం. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్, నేషనల్ కమోడిటీ, డెరివేటివ్స్ ఎక్స్ఛేంజ్తో సహా ఇతర ఎక్స్ఛేంజీల ద్వారా ట్రేడింగ్ చేయవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..