Inflation: ద్రవ్యోల్బణాన్ని అధిగమించి మీ పెట్టుబడులపై మంచి రిటర్న్స్‌ అందుకోవాలనుకుంటున్నారా? ఈ ట్రిక్స్ మీకోసమే..

Inflation: ద్రవ్యోల్బణం పెరుగుదల రేటు ప్రపంచంతో పాటు ఇండియాను కుదిపేస్తోంది. దీని ప్రభావంతో సామాన్యుడి కొనుగోలు శక్తి తగ్గింది. ద్రవ్యోల్బణం పెరుగుదల రేటుతో పోలిస్తే పెట్టుబడుల పై రిటర్న్స్‌ ఆ వృద్ధిని ఇవ్వలేకపోతున్నాయి.

Inflation: ద్రవ్యోల్బణాన్ని అధిగమించి మీ పెట్టుబడులపై మంచి రిటర్న్స్‌ అందుకోవాలనుకుంటున్నారా? ఈ ట్రిక్స్ మీకోసమే..
Good Returns
Follow us
Basha Shek

| Edited By: Anil kumar poka

Updated on: Sep 16, 2022 | 3:28 PM

Inflation: ద్రవ్యోల్బణం పెరుగుదల రేటు ప్రపంచంతో పాటు ఇండియాను కుదిపేస్తోంది. దీని ప్రభావంతో సామాన్యుడి కొనుగోలు శక్తి తగ్గింది. ద్రవ్యోల్బణం పెరుగుదల రేటుతో పోలిస్తే పెట్టుబడుల పై రిటర్న్స్‌ ఆ వృద్ధిని ఇవ్వలేకపోతున్నాయి. ఏప్రిల్ 2022 నాటికి రిటైల్‌ ద్రవ్యోల్బణం 7.79 శాతం గా ఉంది. గత 8 ఏళ్లలో ఇదే అత్యధికం. ఇది మే లో 7.04 శాతానికి తగ్గింది. ఇప్పటికే రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్దేశిత స్థాయి 4 శాతానికి అంటే (2 శాతం ప్లస్ లేదా 2 శాతం మైనస్‌ )గా ద్రవ్యోల్బణం ఉంది. గత 5 నెలలుగా ఇదే స్థాయిలో కొనసాగుతోంది. ఇదిలా ఉంటే మన పెట్టుబడి పై వచ్చే రిటర్న్స్‌ ఇన్ఫ్లేషన్‌ రేటు కంటే ఎక్కువ ఉన్నప్పుడు ద్రవ్యోల్బణాన్ని అధిగమించినట్టు. మార్కెట్ లో వస్తువులు, సేవల ధరలు పెట్టుబడుల పై రిటర్న్స్‌ కంటే ఎక్కువ ఉంటే.. అలాంటి పెట్టుబడులు నిరుపయోగం. ఆ పెట్టుబడుల పై మీకు వచ్చే రిటర్న్స్‌ .. సున్నా మాత్రమే.

 ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి ఏం చేయాలంటే?

వచ్చే 10 నుంచి 20 ఏళ్లలో ద్రవ్యోల్బణం పెరుగుదల రేటు మరింత ఎక్కువగా ఉండొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి ఉత్తమ మార్గం ఏంటంటే.. ద్రవ్యోల్భణం పెరుగుదల రేటు కంటే ఎక్కువ రిటర్న్స్‌ ఇచ్చే సాధనాల్లో పెట్టుబడులు పెట్టడమే. చిన్న మొత్తాల పొదుపు పథకాలకు ద్రవ్యోల్బణం కంటే అధికంగా రిటర్న్స్‌ ఇచ్చే సామర్థ్యం లేదని ఆర్థిక నిపుణులు కూడా ఏకీభవిస్తున్నారు. గత 5 ఏళ్లుగా స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్‌ లో వడ్డీ రేట్లు క్రమంగా తగ్గిపోయాయి. ఈ పరిస్థితుల్లో ద్రవ్యోల్బణాన్ని అధిగమించి దీర్ఘ కాలంలో పెట్టుబడులకు ఆకర్షణీయమైన రిటర్న్స్ ఇచ్చే సామర్థ్యం స్టాక్ మార్కెట్ కు ఉంది.

ఇవి కూడా చదవండి

స్టాక్ మార్కెట్‌ లో రెండు రకాలుగా పెట్టుబడులు పెట్టవచ్చు. మీరే ప్రత్యక్షంగా పెట్టుబడి పెట్టచ్చు. దీనికి మీకు స్టాక్‌ మార్కెట్‌ పై సరైన అవగాహన ఉండాలి. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయడానికి వీలు కల్పించే చాలా సైట్స్ అందుబాటులో ఉన్నాయి. ‘వాటిలో 5పైసా.కామ్ లాంటి సైట్స్ సులభంగా. సురక్షిత మార్గాలలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం కల్పిస్తుంది. ఇది ఔత్సాహికులకు వారి భాషలోనే బ్రౌజ్ చేసే సౌకర్యం కూడ కలిగి ఉంది. మీరు https://bit.ly/3RreGqO ద్వారా ఈ విషయంపై మరిన్ని వివరాలు పొందవచ్చు. ‘లాంగ్ టర్మ్‌ లో స్టాక్‌ మార్కెట్ ద్రవ్యోల్భణం కంటే అధికంగా రిటర్న్స్‌ ఇచ్చింది. ఐతే షార్ట్‌ టర్మ్‌ లో వచ్చే రిటర్న్స్‌ లో అస్థిరత్వం ఉంది. లోతైన పరిశోధన చేసి మంచి అవగాహనతో లాంగ్ టర్మ్‌ లక్ష్యం గా పెట్టుబడులు పెట్టడం ద్వారా ద్రవ్యోల్బణం కంటే అధికంగా రాబడి రావడానికి స్టాక్ మార్కెట్ సహాయపడుతుంది.

SIP లో ఇన్వెస్ట్ మెంట్స్..

స్ఠాక్ మార్కెట్ లో పెట్టుబడి చేయడం రిస్క్‌ అనిపిస్తే .. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ను ఎంచుకోవచ్చు. SIP ( సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌ మెంట్‌ ప్లాన్‌ ) లో చిన్న, చిన్న మొత్తాలు క్రమంగా పొదుపు చేయడం ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌ లో ఒక పెద్ద నిధిని సృష్టించవచ్చు. దీర్ఘకాలంలో మ్యూచువల్‌ ఫండ్స్‌ ద్వారా ఆశించన దాని కంటే ఎక్కువ రిటర్న్స్‌ రావచ్చు. అయితే మ్యూచువల్‌ ఫండ్స్ లో పెట్టుబడికి సరైన ఫండ్ ఎంచుకోవడం చాలా ముఖ్యం .

ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి , మంచి ఈక్విటీ గల స్టాక్స్‌ తో లాంగ్ టర్మ్‌ పోర్ట్‌ ఫోలియో ( 7 ఏళ్ల కంటే ఎక్కువ ) నిర్మించుకోవడానికి మీరు ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ సహాయం తీసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..