Viral Video: మువ్వన్నెల జెండా పట్టుకుని.. డ్యాన్స్‌లు చేస్తూ.. పుత్రికోత్సాహంతో పొంగిపోయిన మీరాబాయి తల్లి

CWG 2022 Mirabai Chanu: బర్మింగ్‌ హామ్‌ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్‌ క్రీడల్లో మణిపూర్‌ మణిపూస సైఖోమ్‌ మీరాబాయి చాను (Saikhom Mirabai Chanu) బంగారు పతకం గెల్చుకుంది. ఈ ప్రతిష్ఠాత్మ క్రీడల్లో భారత్‌కు అందిన మొదటి స్వర్ణపతకం ఇదే.

Viral Video: మువ్వన్నెల జెండా పట్టుకుని.. డ్యాన్స్‌లు చేస్తూ.. పుత్రికోత్సాహంతో పొంగిపోయిన మీరాబాయి తల్లి
Mirabai Chanu
Follow us

|

Updated on: Aug 01, 2022 | 12:22 PM

CWG 2022 Mirabai Chanu: బర్మింగ్‌ హామ్‌ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్‌ క్రీడల్లో మణిపూర్‌ మణిపూస సైఖోమ్‌ మీరాబాయి చాను (Saikhom Mirabai Chanu) బంగారు పతకం గెల్చుకుంది. ఈ ప్రతిష్ఠాత్మ క్రీడల్లో భారత్‌కు అందిన మొదటి స్వర్ణపతకం ఇదే. వెయిట్‌లిఫ్టింగ్‌ 49 కేజీల విభాగం ఫైనల్‌లో మీరాబాయి స్నాచ్‌లో 88 కేజీలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 113 కేజీలు మొత్తం 201 కేజీలు ఎత్తి పసిడిని ముద్దాడింది. తద్వారా అంతర్జాతీయ క్రీడా వేదికపై భారత మువ్వెన్నెల జెండాను మరోసారి రెపరెపలాడించింది. గతేడాది ఆగస్టులో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లోనూ ఈ స్టార్‌ వెయిట్‌లిఫ్టర్‌ రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే.

టీవీలకు అతుక్కుపోయారు..

ఇవి కూడా చదవండి

కాగా మీరాబాయి మ్యాచ్‌ను చూడడానికి మణిపూర్‌లోని ఆమె స్వగ్రామంతో తల్లితో పాటు కుటుంబ సభ్యులందరూ ముందుగానే ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక మ్యాచ్‌ ప్రారంభంకాగాన టీవీ సెట్లకు పూర్తిగా అతుక్కుపోయారు. అర్ధరాత్రంతా మేల్కొనీ మరీ మ్యాచ్‌ను వీక్షించారు. ఎప్పుడైతే మీరాకు పసిడి పతకం ఫిక్స్‌ అయ్యిందో వారి ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. ముఖ్యంగా మీరా తల్లి టాంబీ దేవి పుత్రికోత్సాహంతో పొంగిపోయారు. కుటుంబ సభ్యులు, బంధువులు, చుట్టుపక్కల వారితో కలిసి సంబరాలు చేసుకుంది. ఈ సందర్భంగా మువ్వన్నెల జెండా పట్టుకుని వారితో సంప్రదాయ శైలిలో నాట్యం చేస్తూ కూతురి విజయాన్ని మనసారా ఆస్వాదించారు. కాగా దీనికి సంబంధించిన వీడియోను మీరాబాయి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ‘మా అమ్మ.. ఇంకా బంధువులు.. నా విజయాన్ని ఇంట్లో ఇలా గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నారు’ అంటూ మురిసిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో బాగా వైరలవుతోంది. నెటిజన్లు ఈ వీడియోను రీషేర్‌ చేస్తూ స్టార్‌ వెయిట్‌లిఫ్టర్‌కు, ఆమె తల్లికి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కట్టెలు మోస్తూ..

కాగా మీరాబాయిది సాధారణ మధ్యతరగతి కుటుంబం. కుటుంబ సభ్యులతో కలిసి వంట కలప కోసం వెళ్లినపుడు ఆమె తన అన్న కంటే ఎక్కువ బరువుల్ని మోసేదట. అప్పుడే తనలోని ప్రతిభ చుట్టుపక్కల వారికి తెలిసిందట. అంతేకాదు ట్రక్ డ్రైవర్లతో సవారీలు చేయడం, ఇసుక బస్తాలను ఈజీగా మోసుకెళ్లేదట. ఇలా చిన్నప్పుడే బరువులెత్తడంలో అనుభవం సాధించిన చాను పదకొండేళ్ల వయసులో వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2014 గ్లాస్గో కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో వెండి పతకం సాధించి మొదటిసారి తన ప్రతిభను ప్రపంచానికి చాటింది. 2016లో రియో ఒలింపిక్స్‌లో విఫలమైనా.. 2017లో ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో 48 కేజీల విభాగంలో పసిడిని ముద్దాడింది. ఇక గతేడాది టోక్యో ఒలింపిక్స్‌లో సిల్వర్‌ మెడల్‌ను సొంతం చేసుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..