Telugu News Sports News CWG 2022 Indian Cyclist Meenakshi Suffers Crash, Run Over By Rival video goes viral Telugu Sports News
Viral Video: కామన్వెల్త్ లో అపశ్రుతి.. సైక్లింగ్ లో గాయపడ్డ భారత మహిళా రేసర్.. వైరలవుతోన్న యాక్సిడెంట్ వీడియో
Commonwealth Games 2022: బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. 10కి.మీ స్క్రాచ్ రేసులో భారత సైక్లిస్ట్ మీనాక్షి (Meenakshi) అనుకోని ప్రమాదానికి గురైంది. ఈవెంట్ మధ్యలో సైకిల్‌పై నుంచి..
Commonwealth Games 2022: బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. 10కి.మీ స్క్రాచ్ రేసులో భారత సైక్లిస్ట్ మీనాక్షి (Meenakshi) అనుకోని ప్రమాదానికి గురైంది. ఈవెంట్ మధ్యలో సైకిల్‌పై నుంచి మీనాక్షి పడిపోవడం, ఆవెంటనే ప్రత్యర్థి సైకిల్ ఆమెపై దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. అయితే పోటీ నిర్వాహకులు వెంటనే స్పందించి మీనాక్షిని స్ట్రెచర్‌పై తీసుకెళ్లారు. అంతకుముందు ఆదివారం జరిగిన సైక్లింగ్ పోటీల్లోనూ ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుంది. పోటీల్లో భాగంగా పోటీ దారుడు ఏకండా సైకిల్‌తో ప్రేక్షకులపైకి దూసుకెళ్లడంతో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. కాగా మీనాక్షి యాక్సిడెంట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా ఈ ప్రమాదంలో మీనాక్షి సైకిల్‌పై నుంచి జారిపడి ట్రాక్ అంచుకు చేరుకుంది. అదే సమయంలో న్యూజిలాండ్‌కు చెందిన బ్రయోనీ బోథా సైకిల్ వేగంగా మీనాక్షిపై దూసుకెళ్లింది. దీంతో ఆమె కూడా సైకిల్‌పై నుంచి కిందకు పడిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే వైద్యులు ఘటనా స్థలానికి చేరుకుని రైడర్‌లిద్దరినీ పోటీ నుంచి తప్పించారు. మీనాక్షిని అక్కడి నుంచి స్ట్రెచర్‌పై తీసుకెళ్లారు. కాగా ఈ ఈవెంట్‌లో ఇంగ్లండ్‌కు చెందిన లారా కెన్నీ బంగారు పతకాన్ని గెలుచుకుంది. మీనాక్షి ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక్కడి లీ వ్యాలీ వెలో పార్క్ వద్ద రెండు రోజుల్లో ఇది రెండో ప్రమాదం. అంతకుముందు ఇంగ్లండ్‌కు చెందిన మాట్ వాల్స్ కూడా ఈవెంట్‌లో సైకిల్‌పై నుంచి పడిపోయాడు. అతనికి కుట్లు పడ్డాయి. అదే సమయంలో కెనడాకు చెందిన సైక్లిస్టులు మాట్ బోస్టాక్, డెరెక్ జి కూడా ఆసుపత్రి పాలయ్యారు.