CWG 2022: కామన్వెల్త్‌లో భారత్‌కు మరో మెడల్ ఖరారు.. ఫైనల్స్‌లోకి ప్రవేశించిన టీటీ జట్టు
Commonwealth Games 2022: కామన్‌వెల్త్ క్రీడల టేబుల్ టెన్నిస్ (TT) పురుషుల టీమ్ విభాగంలో భారత జట్టు అదరగొడుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బర్మింగ్‌హామ్‌లోకి అడుగుపెట్టిన పురుషుల జట్టు ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. అచంట శరత్ కమల్..
Commonwealth Games 2022: కామన్‌వెల్త్ క్రీడల టేబుల్ టెన్నిస్ (TT) పురుషుల టీమ్ విభాగంలో భారత జట్టు అదరగొడుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బర్మింగ్‌హామ్‌లోకి అడుగుపెట్టిన పురుషుల జట్టు ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. అచంట శరత్ కమల్ ( Sharath Kamal) నాయకత్వంలోని జట్టు సోమవారం జరిగిన సెమీ ఫైనల్‌లో నైజీరియాను 3-0తో మట్టికరిపించింది. తద్వారా ప్రతిష్ఠాత్మక క్రీడల్లో భారత్‌కు మరో పతకాన్ని ఖాయం చేశారు. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో జి. సత్యన్, హర్మీత్ దేశాయ్ మొదటి డబుల్స్ మ్యాచ్‌లో ఒలాజిడే ఒమోటోయో అండ్ అబ్యోదున్ బోడేపై వరుస గేమ్స్‌తో విజయం సాధించి భారత్‌కు శుభారంభం అందించారు.
ఇక రెండో మ్యాచ్‌లో టేబుల్ టెన్నిస్ స్టార్ ఆటగాడు 40 ఏళ్ల శరత్ కమల్ తన అనుభవాన్నంతా రంగరించాడు. సింగిల్స్ మ్యాచ్‌లో ఖాద్రీపై 11-9, 7-11, 11-8, 15-13 తేడాతో విజయం సాధించాడు భారత్‌ను మరింత ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఇక ఆఖరి పురుషుల సింగిల్స్ విభాగంలో జి సత్యన్ 11-9, 4-11, 11-6, 11-8తో ఒమోటోయోపై విజయం సాధించి భారత్‌ను ఫైనల్‌కు చేర్చాడు. కాగా ఫైనల్ మ్యాచ్ లో సింగపూర్‌తో తలపడనుంది భారత జట్టు. ఇదిలా ఉంటే మనిక బాత్రా నేతృత్వంలోని భారత మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు ఈసారి టైటిల్‌ను కాపాడుకోలేకపోయింది. పరాజయంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.
India ?? march into the Finals of men’s teams at #CWG2022. Sharath Kamal Achanta, Sathiyan Gnanasekaran and Harmeet Desai blank out the Nigerians in straight sets. India to play against Singapore in the gold medal match. pic.twitter.com/eAiccbUMIr
— TT Topspin (@TT_Topspin) August 2, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..