Viral Video: ఎందుకంత అత్యుత్సాహం బ్రదరు! వైడ్‌బాల్‌ను అనవసరంగా గెలికిన బ్యాటర్‌.. తర్వాత ఏమైందో మీరే చూడండి

Cricket: సాధారణంగా క్రికెట్‌ మ్యాచ్‌లో అంపైర్లదే తుది నిర్ణయం. కొన్ని సార్లు వారు తప్పుడు నిర్ణయాలు ఇచ్చినా ఆటగాళ్లు మాత్రం వారి నిర్ణయాలకు కట్టుబడి ఉండాల్సిందే. అయితే ఇంగ్లండ్‌ విలేజ్‌ క్రికెట్‌ లీగ్‌లో ఓ అంపైర్‌ ఇచ్చిన డెసిషన్‌ నవ్వులు పూయించింది

Viral Video: ఎందుకంత అత్యుత్సాహం బ్రదరు! వైడ్‌బాల్‌ను అనవసరంగా గెలికిన బ్యాటర్‌.. తర్వాత ఏమైందో మీరే చూడండి
Follow us
Basha Shek

|

Updated on: Aug 02, 2022 | 12:16 PM

Cricket: క్రికెట్‌ను జెంటిల్మెన్‌ గేమ్‌గా పరిగణిస్తారు. అందుకే గల్లీ క్రికెట్‌ మ్యాచ్‌ అయినా ఎంతో సీరియస్‌గా తీసుకుంటారు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌లు ఎంత రసవత్తరంగా, హోరాహీరోగా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే సీరియస్‌ మ్యాచ్‌లో అప్పుడప్పుడు జరిగే కొన్ని సంఘటనలు నవ్వు తెప్పిస్తుంటాయి. ప్రస్తుతం అలాంటి ఫన్నీ వీడియో ఒకటి నెట్టింట్లో బాగా వైరలవుతోంది. దీనిని చూసి క్రికెట్‌ ఫ్యాన్స్‌ కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. సాధారణంగా క్రికెట్‌ మ్యాచ్‌లో అంపైర్లదే తుది నిర్ణయం. కొన్ని సార్లు వారు తప్పుడు నిర్ణయాలు ఇచ్చినా ఆటగాళ్లు మాత్రం వారి నిర్ణయాలకు కట్టుబడి ఉండాల్సిందే. అయితే ఇంగ్లండ్‌ విలేజ్‌ క్రికెట్‌ లీగ్‌లో ఓ అంపైర్‌ ఇచ్చిన డెసిషన్‌ నవ్వులు పూయించింది. దీనికంటే క్రీజులో ఉన్న బ్యాటర్‌ అత్యుత్సాహంతో చేసిన పని మరింత నవ్వు తెప్పించింది.

అంపైర్ సిగ్నల్ ను చూడకుండా..

ఇవి కూడా చదవండి

వివరాల్లోకి వెళితే.. ఈ మ్యాచ్‌లో బౌలర్‌ లెగ్‌సైడ్‌కు చాలా దూరంగా బంతిని విసురుతాడు. అయితే బంతి బ్యాటర్‌ వద్దకు చేరకముందే పసిగట్టిన అంపైర్‌ వైడ్‌ సిగ్నల్‌ ఇస్తాడు. ఇంతవరకు బాగానే ఉంది.. అయితే క్రీజులో ఉన్న బ్యాటర్‌ అత్సుత్సాహం ప్రదర్శిస్తాడు. కనీసం అంపైర్‌ ఇచ్చిన సిగ్నల్‌ను చూడకుండా వైడ్‌బాల్‌ను భారీ షాట్‌ కొట్టే ప్రయత్నం చేస్తాడు. కానీ షాట్ సెలెక్షన్‌ సరిగా లేకపోవడంతో బంతి అక్కడే గాల్లోకి లేస్తుంది. దీనిని వికెట్‌ కీపర్‌ ఒడిసి పట్టుకోవడంతో సదరు బ్యాటర్‌ క్యాచ్‌ ఔట్‌ అవుతాడు. దీనికి సంబంధించిన వీడియోనూ ఇంగ్లండ్‌ బార్మీ ఆర్మీ షేర్‌ చేయడంతో నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీనిని చూసి క్రికెట్‌ ఫ్యాన్స్‌ కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ‘ఎందుకంత అత్యుత్సాహం బ్రదర్‌.. అంపైర్‌ సిగ్నల్‌ ఇచ్చినా ఎందుకు వైడ్‌ బాల్‌ను ఆడావు, అనవసరంగా గెలికావు.. తగిన మూల్యం చెల్లించుకున్నావు’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..

పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..!అదిరే మేకోవర్ చూస్తే
అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..!అదిరే మేకోవర్ చూస్తే