India vs West Indies: మూడో టీ20 మ్యాచ్‌ కూడా ఆలస్యమే.. ఈసారి కారణమేంటో తెలుసా?

IND vs WI 3rd T20: భారత్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఈరోజు (ఆగస్టు1) మూడో టీ20 మ్యాచ్‌ జరగనుంది. సోమవారం మ్యాచ్‌ జరిగిన సెయింట్‌ కిట్స్‌ పార్క్‌ మైదానమే ఈ మ్యాచ్‌కూ వేదిక కానుంది.

India vs West Indies: మూడో టీ20 మ్యాచ్‌ కూడా ఆలస్యమే.. ఈసారి కారణమేంటో తెలుసా?
India Vs West Indies
Follow us
Basha Shek

|

Updated on: Aug 02, 2022 | 1:08 PM

IND vs WI 3rd T20: భారత్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఈరోజు (ఆగస్టు1) మూడో టీ20 మ్యాచ్‌ జరగనుంది. సోమవారం మ్యాచ్‌ జరిగిన సెయింట్‌ కిట్స్‌ పార్క్‌ మైదానమే ఈ మ్యాచ్‌కూ వేదిక కానుంది. అయితే ఆటగాళ్ల లగేజీ, కిట్లు సమయానికి రాకపోవడంతో రెండో టీ20 మ్యాచ్‌ ఏకంగా మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. సాధారణంగా భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే రాత్రి 11 గంటలకు గానీ ఈ మ్యాచ్‌ ప్రారంభంకాలేదు. అప్పటికీ అందరి ఆటగాళ్ల కిట్లు రాలేదు. దీంతో అర్ష్‌దీప్‌ జెర్సీ వేసుకొని మరీ సూర్యకుమార్‌ యాదవ్‌ బ్యాటింగ్‌కు దిగాడు. ఇప్పుడు మూడో మ్యాచ్‌ టైమింగ్‌ కూడా మారింది. దీనికి సంబంధించి వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డుతో పాటు బీసీసీఐ కూడా ఒక ప్రకటన విడుదల చేశాయి.

‘భారత్‌, విండీస్‌ జట్ల మధ్య జరిగే మూడో మ్యాచ్‌ కూడా ఆలస్యం కానుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు బదులు రాత్రి 9.30 గంటలకు మ్యాచ్‌ ఆరంభమవుతుంది. సోమవారం మ్యాచ్‌ను ఆలస్యంగా ప్రారంభించాల్సి వచ్చింది. అయితే మూడో మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లకు కావాల్సినంత విశ్రాంతినిచ్చేందుకు అవకాశం ఇస్తామని చెప్పడంతోనే ఆయా జట్లు ఇవాళ టీ20 ఆడేందుకు అంగీకరించాయి’ అని బీసీసీఐ ట్వీట్‌ చేసింది. కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇరు జట్లు ప్రస్తుతం 1-1తో సమంగా ఉన్నాయి. దీంతో నేటి మ్యాచ్‌ ఇరు జట్లకు ఎంతో కీలకం కానుంది.

ఇవి కూడా చదవండి

భారత్ ప్రాబబుల్ ప్లేయింగ్ XI: రోహిత్ శర్మ (కెప్టెన్), దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (కీపర్), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్.

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..