Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IBPS PO 2022: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పీవో పోస్టుల కోసం భారీ నోటిఫికేషన్‌.. పూర్తి వివరాలివే

Bank Jobs: బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేరయ్యేవారికి శుభవార్త. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్లు (PO)/ మేనేజ్‌మెంట్ ట్రెయినీ (MT) పోస్టుల భర్తీకి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌ ..

IBPS PO 2022: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పీవో పోస్టుల కోసం భారీ నోటిఫికేషన్‌.. పూర్తి వివరాలివే
Ibps Po Notification
Follow us
Basha Shek

|

Updated on: Aug 02, 2022 | 11:46 AM

Bank Jobs: బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేరయ్యేవారికి శుభవార్త. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్లు (PO)/ మేనేజ్‌మెంట్ ట్రెయినీ (MT) పోస్టుల భర్తీకి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌ (IBPS PO- 2022) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 6432 పోస్టులు భర్తీ చేయనున్నారు డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. పీవో పోస్టుల ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 2 నుంచి ప్రారంభం కానుంది. అర్హులైన అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175; ఇతరులు రూ.850 చెల్లించి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 22 వరకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కొనసాగనుంది. రెండు దశల రాతపరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

బ్యాంకుల వారీగా ఖాళీల వివరాలివే..

  • కెనరా బ్యాంక్: 2500
  • యూకో బ్యాంక్: 550
  • బ్యాంక్ ఆఫ్ ఇండియా: 535
  • పంజాబ్ నేషనల్ బ్యాంక్: 500
  • పంజాబ్ సింధ్ బ్యాంక్: 253
  • యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: 2094

ముఖ్యమైన తేదీలు

ఇవి కూడా చదవండి
  • దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఆగస్టు 2, 2022
  • రిజిస్ట్రేషన్లకు ఆఖరు తేది తేదీ: ఆగస్టు 22, 2022
  • ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్‌లెట‌ర్‌ డౌన్‌లోడ్‌ : సెప్టెంబ‌ర్‌/అక్టోబరు 2022
  • ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్: సెప్టెంబ‌ర్‌/అక్టోబరు 2022
  • ప్రిలిమిన‌రీ ప‌రీక్ష కాల్‌లెట‌ర్ డౌన్‌లోడ్‌: అక్టోబ‌ర్‌ 2022
  • ప్రిలిమిన‌రీ ప‌రీక్ష : అక్టోబ‌రు 2022
  • ప్రిలిమిన‌రీ ప‌రీక్ష ఫ‌లితాలు: న‌వంబ‌రు 2022
  • మెయిన్ ఎగ్జామ్ కాల్‌లెట‌ర్ డౌన్‌లోడ్‌ : న‌వంబ‌రు 2022
  • మెయిన్ ఎగ్జామ్: న‌వంబ‌రు 2022
  • మెయిన్ ఎగ్జామ్ ఫ‌లితాలు: డిసెంబ‌రు 2022
  • ఇంట‌ర్వ్యూ కాల్‌లెట‌ర్ డౌన్‌లోడ్‌ : జ‌న‌వ‌రి/ఫిబ్రవరి 2023
  • ఇంట‌ర్వ్యూలు : జ‌న‌వ‌రి/ఫిబ్రవరి 2023
  •  తుది నియామకాలు: ఏప్రిల్ 2023

రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి, ఇతర వివరాల కోసం IBPS  వెబ్‌సైట్‌ను చూడొచ్చు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆ మారుతీ కారుపై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.లక్ష తగ్గింపు
ఆ మారుతీ కారుపై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.లక్ష తగ్గింపు
ట్రంప్‌ న్యూ రూల్..అలాంటి పోస్ట్‌లు పెడితే అమెరికాలోకి నో ఎంట్రీ!
ట్రంప్‌ న్యూ రూల్..అలాంటి పోస్ట్‌లు పెడితే అమెరికాలోకి నో ఎంట్రీ!
భారత రత్న, నిషాన్‌-ఎ-పాకిస్థాన్‌ అందుకున్న ఏకైక వ్యక్తి ఎవరో తెలు
భారత రత్న, నిషాన్‌-ఎ-పాకిస్థాన్‌ అందుకున్న ఏకైక వ్యక్తి ఎవరో తెలు
'పోలీస్ కానిస్టేబుల్ నియామకాలు 2 నెలల్లో పూర్తి చేయండి'.. సుప్రీం
'పోలీస్ కానిస్టేబుల్ నియామకాలు 2 నెలల్లో పూర్తి చేయండి'.. సుప్రీం
అమెరికా నుంచి భారత్‌కు లష్కర్‌ ఉగ్రవాది తహవూర్‌ రాణా..
అమెరికా నుంచి భారత్‌కు లష్కర్‌ ఉగ్రవాది తహవూర్‌ రాణా..
పుసుక్కున అంత మాట అన్నాడేంటి ?? దారుణం ఇది !!
పుసుక్కున అంత మాట అన్నాడేంటి ?? దారుణం ఇది !!
హెల్మెట్ వాడకపోతే జరిమానా బాదుడు.. కొనుగోలు సమయంలో ఈ టిప్స్ మస్ట్
హెల్మెట్ వాడకపోతే జరిమానా బాదుడు.. కొనుగోలు సమయంలో ఈ టిప్స్ మస్ట్
పంబన్‌ రైల్వే బ్రిడ్జ్‌.. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్‌
పంబన్‌ రైల్వే బ్రిడ్జ్‌.. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్‌
ఈ లక్షణాలున్న వ్యక్తితో పరిచయం మీ పతనానికి దారి.. అవి ఏమిటంటే
ఈ లక్షణాలున్న వ్యక్తితో పరిచయం మీ పతనానికి దారి.. అవి ఏమిటంటే
చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లిన వ్యక్తికి ఊహించని షాక్‌..
చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లిన వ్యక్తికి ఊహించని షాక్‌..