BECIL Recruitment: కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
BECIL Recruitment: బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత మినీ రత్న కంపెనీకి చెందిన ఈ సంస్థ పలు విభాగాల్లో...
BECIL Recruitment: బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత మినీ రత్న కంపెనీకి చెందిన ఈ సంస్థ పలు విభాగాల్లో ఉన్న పోస్ట్‌లను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నారు. ఏయే విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషనల్ భాగంగా మొత్తం 12 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో అకౌంటెంట్ (02), సీనియర్ అసిస్టెంట్ (01), ఆఫీస్ అసిస్టెంట్ (01), టెస్ట్ డ్రైవర్ (06), ఆఫీస్ అటెండెంట్ (01), హౌస్ కీపింగ్ సేవలకు క్లీనర్ (01) ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా పదో తరగతి, 10+2, సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు సంబంధిత విభాగంలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది.
* ఇంటర్వ్యూలను ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ, నాట్రిప్ ఇంప్లిమెంటేషన్ సొసైటీ విభాగం, ప్లాట్ నెం.26, సెక్టార్-3, ఐఎంటీ మనేసర్, గుర్గావ్ అడ్రస్‌లో నిర్వహిస్తారు.
* వాక్ ఇన్ ఇంటర్వ్యూలను 05-08-2022 తేదీన నిర్వహిస్తారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి…