AIASL Jobs: ఎయిర్ ఇండియా ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థుల ఎంపిక..
AIASL Jobs: ఎయిర్ ఇండియా ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ ముంబయి కార్యాలయంలోని ఖాళీలను భర్తీ చేయనుంది. కాంట్రాక్ట్ విధానంలో మొత్తం 62 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.?
AIASL Jobs: ఎయిర్ ఇండియా ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ ముంబయి కార్యాలయంలోని ఖాళీలను భర్తీ చేయనుంది. కాంట్రాక్ట్ విధానంలో మొత్తం 62 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం…
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 62 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో సర్వీస్ అస్యూరెన్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు (50), సర్వీస్ అస్యూరెన్స్ మేనేజర్ పోస్టులు (12) ఉన్నాయి.
* సర్వీస్ అస్యూరెన్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు టెక్నికల్ నైపుణ్యాలు ఉండాలి. అభ్యర్థుల వయసు 28 ఏళ్లు మించకూడదు.
* సర్వీస్ అస్యూరెన్స్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు టెక్నికల్ నైపుణ్యాలు ఉండాలి. అభ్యర్థుల వయసు 32 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులు తమ దరఖాస్తులను ఏఐ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్, జీఎస్‌డీ కాంప్లెక్స్, సీఎస్‌ఎంఐ ఎయిర్‌పోర్ట్, టెర్మినల్ 2, అందేరి ఈస్ట్, ముంబయి-400099 అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.
* ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ. 25,000 నుంచి రూ. 50,000 వరకు చెల్లిస్తారు.
* అభ్యర్థులను గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 06-08-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి…