TS Polycet: ఇంజనీరింగ్‌లోనే కాదు పాలిటెక్నిక్‌లోనూ అదే ట్రెండ్.. ఆ కోర్సుకు జై కొడుతోన్న స్టూడెంట్స్..
TS Polycet: ఇంజనీరింగ్‌లో విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్న కోర్సుల్లో కంప్యూటర్ సైన్స్ మొదటి స్థానంలో ఉంటుందనే విషయం తెలిసిందే. విస్తృత అవకాశాలు ఉండడం, ఐటీ, సాఫ్ట్‌వేరాలు రంగాలు రోజురోజుకీ..
TS Polycet: ఇంజనీరింగ్‌లో విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్న కోర్సుల్లో కంప్యూటర్ సైన్స్ మొదటి స్థానంలో నిలిచిందనే విషయం తెలిసిందే. విస్తృత అవకాశాలు ఉండడం, ఐటీ, సాఫ్ట్‌వేరాలు రంగాలు రోజురోజుకీ వృద్ధి చెందుతుండడంతో ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్ కోర్సుకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఇది కేవలం ఇంజనీరింగ్‌కే పరిమితం కాకుండా పాలిటెక్నిక్‌లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. ఒకప్పుడు పాలిటెక్నిక్‌లో ఎక్కువగా ఎలక్ట్రానిక్, మెకానికల్‌కు మొగ్గు చూపే వారు. అయితే ప్రస్తుతం సీఎస్‌ఈకి జై కొడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ పాలిటెక్నిక్ డిప్లొమాలో కంప్యూటర్ సైన్స్ సంబంధి కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపారు.
తాజాగా జరిగిన తొలి విడుత కౌన్సెలింగ్‌లో కంప్యూటర్ ఇంజనీరింగ్, ఏఐ అండ్ ఎంఎల్, క్లౌడ్ కంప్యూటింగ్ కోర్సులన్నీ భర్తీ కావడం విశేషం. ఈ సీట్లను జులై 28న కేటాయించారు. ఇక తక్కువ సంఖ్యలో సీట్లున్న ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్, బయోమెడికల్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అండ్ సెక్యూరిటీ, కెమికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజినీరింగ్ బ్రాంచీల్లోనూ వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయి.
తొలి విడుదలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 73.69 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. సీట్లు పొందిన విద్యార్థులు జులై 31 లోపు ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని అధికారులు సూచించారు. చివరి విడత కౌన్సెలింగ్ ఆగస్టు 1 నంచి ప్రారంభం కానుండగా, సీట్లను ఆగస్టు 6వ ప్రకటిస్తారు. ఆగస్టు 8 నుంచి విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..