Medical Jobs: ఏపీలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ల పోస్టుల భర్తీ.. ఎవరు అర్హులు? ఎలా ఎంపిక చేస్తారంటే..
Medical Jobs: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏపీవీవీపీ ఆసుపత్రులు, డీఎంఈ విభాగాల్లో పలు ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు...
Medical Jobs: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏపీవీవీపీ ఆసుపత్రులు, డీఎంఈ విభాగాల్లో పలు ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. విజయవాడలోని ప్రజారోగ్య, కటుంబ సంక్షేమ డైరెక్టరేట్ కార్యాలయం ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 823 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ప్రజారోగ్య, కటుంబ సంక్షేమ డైరెక్టరేట్‌లో (635), ఏపీవీవీపీ ఆసుపత్రుల్లో (188) పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 01-07-2022 నాటికి 42 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థుల ఎంపికలో ఇంటర్వ్యూలు లేవు.
* దరఖాస్తుల స్వీకరణకు 06-08-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..