IIIT Hyderabad: క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో సత్తా చాటిన హైదరాబాద్ ట్రిపుల్‌ఐటీ.. ఏడాదికి రూ. 29 లక్షల వేతనంతో..
IIIT Hyderabad: క్యాంసప్ ప్లేస్‌మెంట్స్‌లో హైదరాబాద్ ట్రిపుల్‌ఐటీ సత్తా చాటిచింది. గచ్చిబౌలిలో ఉన్న ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్‌ఐటీ) వేతనాల విషయంలో...
IIIT Hyderabad: క్యాంసప్ ప్లేస్‌మెంట్స్‌లో హైదరాబాద్ ట్రిపుల్‌ఐటీ సత్తా చాటిచింది. గచ్చిబౌలిలో ఉన్న ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్‌ఐటీ) వేతనాల విషయంలో దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచి సరికొత్త రికార్డును సృష్టించింది. హైదరాబాద్ ట్రిపుల్‌ఐటీలో 2020-21 ఏడాదికి గాను బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు సగటున రూ. 29.53 లక్షల వార్షిక వేతనం అందుకున్నారు.
ఇక రూ. 19.15 లక్షలతో ఐఐటీ కాన్పూర్ రెండో స్థానంలో నిలిచింది. అనతరం రూ. 18.70 లక్షల వార్షిక వేతనంతో ఐఐటీ గువహటి, రూ. 17.60 లక్షలతో ఐఐటీ ఢిల్లీ, రూ. 16.72 లక్షలతో ఐఐటీ రూర్కీ, రూ. 16.25 లక్షలతో ఐఐటీ హైదరాబాద్, రూ. 16.00 లక్షలతో ఐఐటీ వారణాసి, రూ. 15 లక్షలతో ఐఐటీ బాంబే, రూ. 15 లక్షలతో ఐఐటీ ఖరగ్‌పూర్, రూ. 15 లక్షలతో ఐఐటీ మద్రాస్, రూ. 13 లక్షలతో బిట్స్ పిలాని, రూ. 10 లక్షలతో ఎన్‌ఐటీ వరంగల్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
ట్రిపుల్‌ఐటీ ఏర్పాటు విషయానికొస్తే ఐటీ రంగంలో ప్రపంచ స్థాయి ప్రతిభావంతులను అందించాలనే లక్ష్యంతో 1998లో 66 ఎకరాల విస్తీర్ణంలో క్యాంపస్‌ను ఏర్పాటు చేశారు. ఈ క్యాంపస్‌లో కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ సంబంధిత కోర్సులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఫీజులు, కన్సల్టెన్సీ ప్రాజెక్టుల ద్వారా వచ్చిన ఆదాయంతోనే ఈ విద్యా సంస్థ నడుస్తుంది. జేఈఈలో సాధించిన స్కోర్‌తో పాటు ట్రిపుల్‌ఐటీ నిర్వహించే పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..