GATE Exam: బీటెక్‌ విద్యార్థులకు అలర్ట్‌.. వారం రోజుల్లో గేట్‌ నోటిఫికేషన్‌.. పరీక్ష ఎప్పుడంటే..

GATE Exam 2023: దేశంలోని ఐఐటీల్లో ఎంటెక్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో చేరడానికి నిర్వహించే గేట్‌ (గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌) పరీక్ష కోసం విద్యార్థులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు...

GATE Exam: బీటెక్‌ విద్యార్థులకు అలర్ట్‌.. వారం రోజుల్లో గేట్‌ నోటిఫికేషన్‌.. పరీక్ష ఎప్పుడంటే..
Gate 2023
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 28, 2022 | 7:54 AM

GATE Exam 2023: దేశంలోని ఐఐటీల్లో ఎంటెక్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో చేరడానికి నిర్వహించే గేట్‌ (గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌) పరీక్ష కోసం విద్యార్థులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు. కేవలం ఉన్నత విద్య కోసమే కాకుండా, పలు రకాల ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి కూడా గేట్‌ స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటారనే విషయం తెలిసిందే. దీంతో ఈ పరీక్షలో ఎలాగైనా అర్హత సాధించాలనే ఉద్దేశంతో విద్యార్థులు లాంగ్ టర్మ్‌ కోచింగ్ వెళ్తుంటారు. ఇకా ఏటా నిర్వహించే గేట్‌ పరీక్షలో భాగంగా 2023 ఏడాదిగాను నోటిఫికేషన్‌ త్వరలోనే విడుదల కానుంది.

వారంలో రోజుల్లో గేట్‌-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేయడానికి ఐఐటీ కాన్పూర్ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా అందుతోన్న సమాచారం మేరకు గేట్‌ దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబర్‌లో మొదలయ్యే అవాకశం ఉన్నట్లు తెలుస్తోంది. 2023 ఫిబ్రవరి 4 నుంచి 13 తేదీల మధ్య గేట్‌ ఎగ్జామ్‌ను నిర్వహించాలని ఐఐటీ కాన్పూర్‌ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే బీటెక్‌తో పాటు సంప్రదాయ డిగ్రీ చేసిన వారు కూడా గేట్‌ పరీక్ష రాయొచ్చు. మొత్తం 29 సబ్జెక్టుల్లో ఈ పరీక్ష జరుగుతుంది. గతేడాది గేట్‌ పరీక్షకు 7.11 లక్షల మంది హాజరుకాగా, 1.26 లక్షల మంది అర్హత సాధించారు.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..