UGC: విద్యార్థులకు యూజీసీ బంపరాఫర్‌.. ఉచితంగా 23,000కి పైగా కోర్సులు.. ఏఐ, సైబర్‌ సెక్యూరిటీతో పాటు మరెన్నో..

UGC: యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (UGC) విద్యార్థులకు బంపరాఫర్‌ ప్రకటించింది. ఉన్నత విద్యకు సంబంధించి 23,000కిపైగా కోర్సులను ఉచితంగా అందిస్తోంది. ఈ ఆన్‌లైన్‌ కోర్సులను పూర్తిగా ఉచితంగా అందిస్తోంది...

UGC: విద్యార్థులకు యూజీసీ బంపరాఫర్‌.. ఉచితంగా 23,000కి పైగా కోర్సులు.. ఏఐ, సైబర్‌ సెక్యూరిటీతో పాటు మరెన్నో..
Ugc
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 29, 2022 | 8:22 AM

UGC: యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (UGC) విద్యార్థులకు బంపరాఫర్‌ ప్రకటించింది. ఉన్నత విద్యకు సంబంధించి 23,000కిపైగా కోర్సులను ఉచితంగా అందిస్తోంది. ఈ ఆన్‌లైన్‌ కోర్సులను పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. ఇందుకోసం యూజీసీ కొత్త వెబ్‌ పోర్టల్‌ను లాంచ్‌ చేసింది. పూర్తిగా ఉచితంగా అందిస్తోన్న ఈ కోర్సుల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, సైబర్‌ సెక్యూరిటీతో పాటు మరెన్నో డిమాండ్‌ ఉన్న కోర్సులు అందిస్తున్నారు.

దేశంలోని నలుమూలల ఉన్న విద్యార్థులకు రిమోట్‌ విధంలో ఉన్న విద్యను అందించే లక్ష్యంగా ఈ కొత్త పోర్టల్‌ను లాంచ్‌ చేశారు. నేషనల్ ఎడ్యుకేషన్‌ పాలసీ-2020 తీసుకొచ్చి రెండేళ్లు గడుస్తోన్న నేపథ్యంలో జులై 28 నుంచి ఈ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖతో ఒప్పందం చేసుకున్న యూజీసీ ఈ పోర్టల్‌ను తీసుకొచ్చింది. ఈ విషయమై యూజీసీ ఛైర్మన్‌ ఎమ్‌ జగదీశ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘అందరికీ ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో ఈ పోర్టల్‌ను తీసుకొచ్చాము. ఇంగ్లిష్‌తో పాటు అన్ని స్థానిక భాషల్లో ఈ పోర్టల్‌ అందుబాటులో ఉంటుంది. కామన్‌ సర్వీస్‌ సెంటర్స్‌ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వారికి కూడా డిజిటల్‌ నైపుణ్యాలు పెరుగుతాయ’ని చెప్పుకొచ్చారు.

ఈ పోర్టల్‌లో 23,000కిపైగా పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులను అందిస్తుండగా ఇందులో 137 SWAYAM MOOC కోర్సులతో పాటు 25 నాన్‌ ఇంజనీరింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కోర్సులన్నీ ఉచితంగా అందిస్తున్నప్పటికీ సీఎస్‌సీ/ఎస్‌పీవీ సేవలను పొందడానికి మాత్రం యూజర్లు రోజుకు రూ. 20 లేదా నెలకు రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్