SAIL Recruitment 2022: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పారామెడిక్ ట్రైనీ పోస్టులు.. రాత పరీక్షలేకుండా ఎంపిక..
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన (SAIL) పశ్చిమ బెంగాల్‌లోని బర్న్‌పూర్ హాస్పిటల్‌లో ప్రొఫిషియెన్సీ ట్రైనింగ్ ప్రోగ్రాం(పారామెడిక్స్) కింద.. 45 పోస్టుల భర్తీకి అర్హులైన..
SAIL-Burnpur Hospital paramedic trainee Recruitment 2022: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన (SAIL) పశ్చిమ బెంగాల్‌లోని బర్న్‌పూర్ హాస్పిటల్‌లో ప్రొఫిషియెన్సీ ట్రైనింగ్ ప్రోగ్రాం(పారామెడిక్స్) కింద.. 45 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేయనున్న పోస్టులు ఏవంటే.. ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ పోస్టులు: 7
- డ్రెస్సర్ పోస్టులు: 3
- ఎక్స్-రే టెక్నీషియన్ పోస్టులు: 4
- ఈసీజీ టెక్నీషియన్ పోస్టులు: 3
- డయాలసిస్ టెక్నీషియన్ పోస్టులు: 2
- ఫార్మాసిస్ట్ పోస్టులు: 6
- ల్యాబొరేటరీ టెక్నీషియన్ అండ్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ పోస్టులు: 12
- పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ టెక్నీషియన్ పోస్టులు: 1
- ఆప్టోమెట్రిస్ట్ పోస్టులు: 2
- ఫ్లేబోటోమిస్ట్ పోస్టులు: 2
- వ్యాక్సినేటర్ పోస్టులు: 1
- డెంటల్ హైజీనిస్ట్ పోస్టులు: 1
- డెంటల్ అసిస్టెన్స్/డెంటల్ ఆపరేటింగ్ రూమ్ అసిస్టెంట్ పోస్టులు: 1
టెన్త్/ఇంటర్మీడియట్/ఏఎన్‌ఎం/జీఎన్‌ఎం/డిప్లొమా/డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించివారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐతే ఆగస్టు 1, 2022 నాటికి దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు 30 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తికలిగిన అభ్యర్ధులు నేరుగా ఆగస్టు 12, 13 తేదీల్లో నిర్వహించే ఇంటర్వ్యూకి కింది అడ్రస్‌కు హాజరుకావచ్చు. అలాగే వెబ్‌సైట్ నుంచి అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఈ మెయిల్ medical.burnpurhospital@gmail.comI చేయవచ్చు. ఎంపికైన అభ్యర్ధులకు స్టైపెండ్‌గా నెలకు రూ.15,020 ల నుంచి రూ.25,000ల వరకు చెల్లిస్తారు.
అడ్రస్: Confluence, Opp. to Burnpur Post Office, Near Bharti Bhawan, P.O. Burnpur -713325, DT: Paschim Bardhaman, West Bengal.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.