Viral Video: ‘అది నా తప్పెలా అవుతుంది?’..30 మంది స్కూల్‌ విద్యార్ధులకు ఒక్క సిరంజితో కోవిడ్‌ వ్యాక్సిన్‌..

ఓ ప్రబుద్ధుడు పాఠశాల విద్యార్ధులకు ఒకేఒక సిరంజితో ఏకంగా 30 మంది విద్యార్థులకు కోవిడ్‌ వ్యాక్సిన్లు వేశాడు. ఇదేంటని ప్రశ్నించిన వారికి దిమ్మతిరిగిపోయే సమాధానం ఇచ్చాడు.. అసలేంజరిగిందంటే..

Viral Video: 'అది నా తప్పెలా అవుతుంది?'..30 మంది స్కూల్‌ విద్యార్ధులకు ఒక్క సిరంజితో కోవిడ్‌ వ్యాక్సిన్‌..
Covid 19 Vaccination
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 28, 2022 | 6:56 PM

MP health worker who vaccinated 30 students with 1 syringe: కరోనా మహమ్మారి ప్రపంపవ్యాప్తంగా ఘోర మారణహోమాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. వ్యాక్సిన్‌ వచ్చాక పూర్తిగాకాకపోయినా పాక్షికంగానైనా మరణాల రేటు తగ్గిందని చెప్పవచ్చు. దేశదేశాల్లో వ్యాక్సిన్‌ ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతోంది. దీనిలో భాగంగా మన దేశంలో కూడా ప్రతి ఒక్కరికీ రెండు డోసుల ప్రక్రియ పూర్తిచేసి, బూస్టర్‌ డోసులు కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. స్కూల్ విద్యార్ధులకు కూడా వ్యాక్సిన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఐతే తాజాగా మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ జిల్లోలో ఓ ప్రబుద్ధుడు పాఠశాల విద్యార్ధులకు ఒకేఒక సిరంజితో ఏకంగా 30 మంది విద్యార్థులకు కోవిడ్‌ వ్యాక్సిన్లు వేశాడు. ఇదేంటని ప్రశ్నించిన వారికి దిమ్మతిరిగిపోయే సమాధానం ఇచ్చాడు.. అసలేంజరిగిందంటే..

సాగర్ జిల్లాలోని జైన్ పబ్లిక్ హయ్యర్ సెకండరీ స్కూల్‌ విద్యార్థులకు కోవిడ్ వ్యాక్సిన్‌ వేసేందుకు ప్రభుత్వం తరపున జితేంద్ర అనే వ్యక్తి బుధవారం (జులై 27) ఉదయం చేరుకున్నాడు. ఐతే అతను విద్యార్ధులకు ఒకే సిరంజితో టీకాలు వేయడం ప్రారంభించారు. ఈ విధంగా దాదాపు 30 మంది విద్యార్ధులకు ఒక్క సిరంజితోనే వ్యాక్సిన్లు వేశాడు. దీనిని గమనించిన తల్లిదండ్రులు సదరు వ్యక్తిని ప్రశ్నించడంతో.. తనకు అధికారులు ఒక్క సిరంజి మాత్రమే ఇచ్చారని, దానితోనే విద్యార్ధులందరికీ వ్యాక్సిన్లు వేయాలని చెప్పినట్లు వారితో తెలిపాడు. మెటీరియల్‌ డెలివరీ చేసిన వ్యక్తి ఒక్క సిరంజి మాత్రమే ఇచ్చాడన్నాడు. వేరువేరు వ్యక్తులకు ఒకే సిరంజి వాడకూదని నీకు తెలియదా అన్ని ప్రశ్నిస్తే.. ‘నాకు తెలుసు.. ఒక సిరంజీతోనే వ్యాక్సిన్లు వేయాలా అని అడిగితే..అధికారులు అవునన్నారు. ఇది నా తప్పు ఎలా అవుతుంది? వాళ్లు ఏం చెప్పారో అదే నేను చేశాను.. అని సమాధానం చెప్పాడు. సదరు వ్యక్తి పేరును తల్లిదండ్రులు అడుగగా తెలియదని బుకాయించాడు. దీంతో విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. వ్యాక్సినేటర్‌ తతంగాన్ని తల్లిదండ్రలు స్వయంగా వీడియో తీసి ట్విటర్‌లో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్‌ అయ్యింది. దీంతో నెట్టింట ఈ వీడియో హల్‌చల్‌ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

కాగా 1990 నుంచి హెచ్‌ఐవీ వ్యాప్తిని అరికట్టేందుకు ఒకసారి వాడి పారవేసే డిస్పోజబుల్ సిరంజిలు దేశ వ్యాప్తంగా ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. కోవిడ్‌ వ్యాక్సినేషనేషన్‌ ప్రారంభించినప్పటి నుంచి ఈ ప్రొటోకాల్‌ విధిగా పాటించవల్సిందిగా యూనీసెఫ్‌ సైతం ప్రకటించింది. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సాగర్‌ జిల్లా అధికారులు జితేంద్రపై కేసు నమోదు చేశారు. బుధవారం ఉదయం వ్యాక్సినేషన్‌ మెటీరియల్‌ పంపించిన జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డా. రాకేష్‌ రోషన్‌పై కూడా శాఖాపరమైన విచారణ కొనసాగిస్తున్నారు. ఆ ఘటన వెలుగులోకి వచ్చాక జితేంద్ర ఫోన్‌ స్విచ్ ఆఫ్‌ చేసుకున్నాడని, అప్పటి నుంచి అతను పరారీలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.