Viral Video: రియల్ బాహుబలి..! ఏకంగా ఆ మహా శివుడినే తన భుజాలపై మోస్తున్నాడు..
కన్వారియాలు గంగా నది పవిత్ర జలాన్ని తీసుకురావడానికి ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, గౌముఖ్ మరియు గంగోత్రి, బీహార్‌లోని సుల్తాన్‌గంజ్ వంటి ప్రదేశాలను సందర్శించి, అదే నీటితో దేవుడిని పూజిస్తారు.

Viral Video: గంగా జలాన్ని సమర్పించి శివుడిని ఆరాధించే మిలియన్ల మంది కన్వారియాలకు శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనది. చాలా మంది కన్వారియాలు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి చెప్పులు లేకుండా నడుస్తూ కఠినమైన మార్గాన్ని ఎంచుకుంటారు. కొందరు ప్రయాణించడానికి వివిధ రవాణా మార్గాలను కూడా ఉపయోగిస్తారు. కానీ, ఒక కన్వరియా మాత్రం శివుడి విగ్రహాన్ని తన భుజాలపై పెట్టుకుని రోడ్డుపై నడిచే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు ఈ వీడియోలో చూడగలిగినట్లుగా, కన్వరియా తనతో పాటు ఒక కుర్చీని కూడా తీసుకువెళుతున్నాడు..అతను అలసిపోయిన వెంటనే, అతను ఆ భోళ శంకుడిని ఆ కుర్చీపై కూర్చోబెట్టి విశ్రాంతి తీసుకుంటాడు. కాసేపయ్యాక కుర్చీని భుజం మీద వేసుకుని భోలేనాథ్ విగ్రహాన్ని భుజంపై పెట్టుకుని ముందుకు నడుస్తున్నాడు.
ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో హర్షనకవి అనే ఖాతా ద్వారా షేర్ చేశారు. “హర్ హర్ శంభు” అనే క్యాప్షన్ ఇచ్చారు. వీడియోకు 1,274,245 లైక్‌లు,అనేక కామెంట్‌లు వచ్చాయి. నెటిజన్లు అతనిపై ప్రేమను కురిపించారు. ఇదే కదా స్వచ్ఛమైన శివభక్తి అంటే, అంటూ కామెంట్ చేశారు ఒక నెటిజన్. హర్ హర్ మహాదేవ్ అంటూ మరో వినియోగదారు కామెంట్ చేశారు.




View this post on Instagram
‘కన్వర్ యాత్ర’: ‘కన్వర్ యాత్ర’ అనేది శివ భక్తులకు వార్షిక తీర్థయాత్ర. కన్వారియాలు గంగా నది పవిత్ర జలాన్ని తీసుకురావడానికి ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, గౌముఖ్ మరియు గంగోత్రి, బీహార్‌లోని సుల్తాన్‌గంజ్ వంటి ప్రదేశాలను సందర్శించి, అదే నీటితో దేవుడిని పూజిస్తారు. గత రెండేళ్లుగా కన్వర్ యాత్ర జరగడం లేదని, పవిత్ర యాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వివిధ ప్రాంతాల్లో అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటోంది. శ్రావణ మాసం, వర్షాకాలం ప్రారంభాన్ని సూచించడమే కాకుండా గణేష్ చతుర్థి, రక్షాబంధన్, జన్మాష్ఠి మొదలైన పండుగలు ఈ మాసంలో జరుపుకుంటారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి