కడప జిల్లా సిద్ధవటం మండలం కనుమలోపల్లె సమీపంలో రైలు ఢీకొని ఇద్దరు మహిళలు మృతి చెందారు. శ్రీ మానసా దేవి అమ్మవారి ఆలయం ఎదురుగా ఉన్న రైల్వే ట్రాక్‌పై ఈ విషాదం చోటుచేసుకుంది. మృతుల వయస్సు సుమారు 60 నుంచి 65 ఏళ్లుగా రైల్వే పోలీసులు అంచనా వేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.