ప్రేమికుల రోజును చాలా స్పెషల్‌గా జరుపుకునే దేశాలు ఏవో తెలుసా?

Samatha

8  February 2026

వాలెంటైన్స్ వీక్ స్టార్ట్ అయ్యింది. వారం రోజుల పాటు ప్రేమికులు తమ భాగస్వామికి రక రకాల గిఫ్ట్‌లు ఇస్తూ తమ ప్రేమను వ్యక్త పరుస్తుంటారు.

వాలెంటైనస్ డే

అయితే ఇప్పుడు మనం అసలు ఈ ప్రేమికుల రోజును ఏ దేశాల వారు ఘనంగా జరుపుకుంటారు. అక్కడ స్పెషల్ ఏంటో వివరంగా తెలుసుకుందాం.

ఏ దేశాలు

ఫ్రాన్స్ దేశాన్ని ప్రేమ రాజధానిగా పిలుస్తుంటారు. ఈ దేశంలో చాలా ఘనంగా వాలెంటైన్స్ డేను జరుపుకుంటారు. రొమాంటిక్ డిన్నర్స్, ఈఫిల్ టవర్ దగ్గర డేటింగ్స్ కామన్. ఇక్కడే ప్రేమను వ్యక్త పరచడం చేస్తుంటారంట.

ఫ్రాన్స్

ఇటలీలో కూడా లవర్స్ డేను చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ముఖ్యంగా బాసి పెరుగ్గి లాంటి ఫేమస్ చాక్లెట్స్, లవ్ లాక్స్ ఇక్కడ ప్రత్యేకం. ఇక్కడ తమ ప్రేమ శాశ్వతం అంటూ వంతెనపై లాక్ వేసి, కీలను నదిలో వదిలేస్తారు.

ఇటలీ

అమెరికాలో కూడా చాలా కలర్ ఫుల్‌గా వాలెంటైన్స్ డేను జరుపుకుంటారు. ఇక్కడ గ్రీటింగ్ కార్డ్స్, అందమైన గులాబీలు, చాక్లెట్స్ ఇచ్చి తమ ప్రేమను వ్యక్త పరుస్తుంటారు.

అమెరికా

జపాన్ లో వాలెంటైన్స్ చాక్లెట్స్ ఇచ్చి సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రేమికుల రోజు ఇక్కడి మహిళలు పురుషులకు గిరి, హాన్సీ చాక్లెట్స్ ఇస్తారు. తర్వాత పురుషులు మహిళలు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు.

జపాన్

దక్షిణ ఆఫ్రికాలో చాలా డిఫరెంట్‌గా ప్రేమికుల రోజును జరుపుకుంటారు. ఫిబ్రవరి 14న ఇక్కడి మహిళలు, తన ప్రియుడి పేరు రాసిన హార్ట్‌ను స్లీవ్ పై పిన్ చేసుకొని,  తమ ప్రేమను వ్యక్త పరుస్తుంటారు. ఇది అక్కడి సంప్రదాయం.

దక్షణి ఆఫ్రికా

వేల్స్, యూకేలో లవ్ స్పూన్స్, చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడి వారు ప్రేమికుల రోజున చెక్కతో చెక్కిన స్పూన్స్‌ను బహుమతిగా ఇస్తారు. ఇది చాలా రోజుల నుంచి కొనసాగుతున్న అక్కడి పురాతన సంప్రదాయం.

వేల్స్, యూకే