లక్కీ ఇండియన్.. దుబాయ్ లాటరీలో రూ.49 కోట్లు
అబుదాబి బిగ్ టికెట్ లాటరీలో కర్ణాటకకు చెందిన శంతను శెట్టిగార్ రూ. 49 కోట్లు గెలుచుకున్నారు. ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన ఆయన, ఒక్క ఫోన్ కాల్‌తో కోటీశ్వరుడయ్యారు. ఈ భారీ ప్రైజ్ మనీని స్నేహితుడితో పంచుకుంటానని శంతను ప్రకటించారు. ఇది ప్రవాస భారతీయుల జీవితాలను మార్చేస్తుందని మరోసారి నిరూపితమైంది. బిగ్ టికెట్ చరిత్రలో శంతను అతిపెద్ద విజేతల్లో ఒకరు.
ఉపాధి కోసం ఎడారి దేశానికి వెళ్లి కోటీశ్వరుడయ్యాడు ఓ సామాన్య మధ్యతరగతి భారతీయుడు. కర్ణాటకలోని ఉడుపి జిల్లాకు చెందిన శంతను శెట్టిగార్ జీవితం ఒక్క ఫోన్ కాల్‌తో మలుపు తిరిగింది. అబుదాబిలో నిర్వహించిన ‘బిగ్ టికెట్’ లక్కీ డ్రాలో ఏకంగా 20 మిలియన్ దర్హామ్‌లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 49 కోట్ల జాక్‌పాట్‌ను ఆయన సొంతం చేసుకున్నారు. కానీ ఈ గెలుచుకున్న డబ్బులో మరో వ్యక్తికి కూడా వాటా ఇస్తానని చెప్పి శంతను బాంబ్ పేల్చారు. శంతను భారీ విజయం వెనుక అతని స్నేహితుడి హస్తం కూడా ఉంది. శంతను ఈ లాటరీ టికెట్‌ను ఒంటరిగా కాకుండా తన స్నేహితుడితో కలిసి కొన్నారు. “ఈ గెలుపు తనకు మాటల్లో చెప్పలేనంత సంతోషాన్ని ఇచ్చిందనీ నిబంధనల ప్రకారం ఈ ప్రైజ్ మనీని తప స్నేహితుడితో సమానంగా పంచుకుంటానని ఆయన మీడియాకు తెలిపారు. ఇంత పెద్ద మొత్తంతో వచ్చిన డబ్బుతో ఏం చేయాలో, ప్లాన్ ఏంటో ఇంకా నిర్ణయించుకోలేదని.. ప్రస్తుతానికి ఈ ఆనంద క్షణాలను ఆస్వాదిస్తున్నానని అన్నారు. ఈ డ్రాలో శంతనుతో పాటు మరో ఐదుగురు అదృష్టవంతులు చెరో 1 మిలియన్ దిర్హామ్‌లను గెలుచుకున్నారు. ఇందులో భారతీయులే ఎక్కువుండటం విశేషం. కాష్ ప్రైజ్‌తో పాటు ఒకరికి ఖరీదైన లగ్జరీ కారు కూడా ఇచ్చారు. బిగ్ టికెట్ చరిత్రలో శంతను శెట్టిగార్ ఇప్పుడు అతిపెద్ద విజేతల జాబితాలో ఒకరిగా చేరిపోగా విషయం తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు తెగ సంబరపడిపోయారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉంటున్న ప్రవాస భారతీయుల తలరాతను మారుస్తుందో ఈ లాటరీ టికెట్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైలు పట్టాలపై మూడు ప్రాణాలు.. తల్లి పిలుపుతో మృత్యుఒడిలోకి.. అసలేం జరిగింది
క్వాంటం వ్యాలీ కోసం 50 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం
మద్యం మత్తులో మాస్ ఫైట్! బార్ బయట వీరంగం.. అసలేం జరిగిందంటే..
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

