Monica Song: పూజా పాపకే సవాలు విసిరిన బుడ్డోడు..’మౌనికా’ సాంగ్‌కు అద్దిరిపోయే స్టెప్పులు.. వీడియో
రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమాలో పూజా హెగ్డే ఒక స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. మోనికా అంటూ ఆమె చేసిన డ్యాన్సులు సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఇప్పుడిదే పాటకు ఓ ఐదేళ్లు బుడ్డోడు అద్దిరిపోయే స్టెప్పులేశాడు. అది కూడా పూజా హెగ్డేను మరిపించేలా..

గతేడాది సూపర్‌స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ ‘కూలీ’. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కంచిన ఈ భారీ మల్టీస్టారర్ మూవీలో చాలా మంది స్టార్స్ నటించారు. అక్కినేని నాగార్జున విలన్ గా నటించగా కన్నడ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్, మలయాళం స్టార్ సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్, మోనికా రెబ్బా తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. అయితే ఇదే సినిమాలో టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే ఓ ప్రత్యేక సాంగ్‌లో మెరిసింది. మోనికా అంటూ అభిమానులను ఓ రేంజ్‌లో ఊపేసింది. పూజా హెగ్డే చేసిన ఈ స్పెషల్ పాటకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. సినిమా విజయంలో ఈ స్పెషల్ సాంగ్ బాగా హైలెట్ గా నిలిచింది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ సాంగ్ ఓ రేంజ్ లో సెన్సేషన్ అయ్యింది. చాలా మంది నెటిజన్లు ఈ పాటను రీక్రియేట్ చేస్తూ రీల్స్, షార్ట్స్ వేశారు. ఇప్పుడు ఇదే మౌనికా సాంగ్ కు ఓ ఐదేళ్లు బుడ్డోడు సూపర్బ్ డ్యాన్స్ వేశాడు. పూజా హెగ్డేను మరిపించేలా అద్దిరిపోయే స్టెప్పులేశాడు. పిల్లాడి ఎనర్జీని చూసి పూజా హెగ్డే కూడా ఆశ్చర్యపోయింది. ఇప్పుడీ సాంగ్ కు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
రీసెంట్‌గా తమిళనాడులో జరిగిన ఒక ఈవెంట్‌కి పూజా హెగ్దే ముఖ్య అతిథిగా హాజరయ్యింది. ఈ వేడుకలో వేదికపై వచ్చి పూజా హెగ్దేను మౌనిక డ్యాన్స్ చేయమని అభిమానులు కోరతారు. అయితే పూజా మౌనికా పాటకు డ్యాన్స్ చేస్తుండగానే ఒక బుడ్డోడు స్టేజ్ ఎక్కుతాడు. పూజకు పోటీగా మౌనికా సాంగ్ కు డ్యాన్స్ చేశాడు. ఎంతో ఉత్సాహంతో సూపర్ స్టెప్పులతో అదరగొట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. బుడ్డోడి ఎనర్జీని చూసి అందరూ ఫిదా అవుతున్నారు.
పూజా హెగ్డేతో పిల్లాడి డ్యాన్స్ .. వీడియో ఇదిగో..
Yaara nee 🤯🔥 pic.twitter.com/YH1heMRynH
— OTT Trackers (@OTT_Trackers) February 8, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




