Viral Video: మాయ లేదు మంత్రం లేదు.. నిటారుగా ఉన్న కొండను బౌద్ధ సన్యాసి ఎలా ఎక్కారో చూడండి
సన్యాసులు ఎప్పుడూ యోగా, ధ్యానంలోనే ఉంటారని చెబుతుంటారు. అందువల్లే వారు కొన్ని ఊహించలేని పనులను కూడా చేయగలరు. చాలా మంది సన్యాసులు తమ శరీరాలను..
Viral Video: రాక్‌క్లైంబిగ్స్ గురించి మీరు వినే ఉంటారు. చాలా మంది యువతీ యువకులు, చిన్నారుల సైతం రాక్ క్లైంబింగ్‌లో శిక్షణ పొంది ఎత్తైన కొండలు, ఎవరెస్ట్ శిఖరాలను అధిరోహిస్తుంటారు. అలాంటి సాహస యాత్రలు గతంలో చాలానే చూసివుంటారు. కానీ ఆశ్చర్యానికి గురిచేసే యాత్ర ఎవరైనా చూశారా…? నిటారుగా ఉన్న కొండను ఎక్కాలంటే నిజంగా సాహస విన్యాసమే అవుతుంది. తాళ్ల సాయంతో సునాయాసంగా ఎక్కే వారు ఉంటారు. కానీ, ఏ సహాయమూ లేకుండా, అది కూడా కేవలం రెండు కాళ్ల సాయంతోనే సునాయాసంగా కొండలను ఎక్కేస్తున్న బౌద్ధ సన్యాసికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. బౌద్ధ సన్యాసి కొండను ఎక్కుతున్న వీడియోను తన్సు యేగెన్ అనే వ్యక్తి ట్విట్టర్ లో షేర్ చేయగా, ఆ వీడియో కాస్త తెగ వైరల్ అవుతోంది. అయితే, ఈ వీడియో పాతదే అయినప్పటికీ మరోమారు సోషల్ మీడియాను ఊపేస్తోంది.
సన్యాసులు ఎప్పుడూ యోగా, ధ్యానంలోనే ఉంటారని చెబుతుంటారు. అందువల్లే వారు కొన్ని ఊహించలేని పనులను కూడా చేయగలరు. చాలా మంది సన్యాసులు తమ శరీరాలను మార్చుకోవడానికి ప్రత్యేక శ్వాస పద్ధతులను ఉపయోగిస్తారు. సన్యాసులు ఎక్కువ సమయం ధ్యానంలోనే ఉండటం చేత వారిలో ఏకగ్రాత మరింత ఎక్కువగా ఉంటుంది. వారి మనస్సులు భావోద్వేగాలపై సంపూర్ణ నియంత్రణతో ఉంటారు. సాధారణ వ్యక్తులు చాలా కష్టంగా భావించే పనులను సన్యాసులు చాలా సులభంగా సాధించగలుగుతారు. సూపర్ పవర్స్ ఉన్న అటువంటి సన్యాసి ఒకరు భద్రతా, ఏ తాడు సాయం లేకుండానే అప్రయత్నంగా పర్వతాన్ని అధిరోహించడం వైరల్ అవుతోంది. ఈ వీడియోను తన్సు యెగెన్ అనే యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీనికి 510k పైగా వీక్షణలు 22k లైక్‌లు వచ్చాయి.
He just needs nothing to climb a hill… pic.twitter.com/PmnLZ4zLYd
— Tansu YEĞEN (@TansuYegen) July 20, 2022
వైరల్ అవుతున్న ఈ వీడియోలో..ఓ కొండను ఎక్కేందుకు ఇద్దరు మహిళలు ప్రయత్నం చేస్తుంటారు. నిటారుగా నిలబడి ఉన్నట్టుగా ఉన్న ఆ కొండను ఎక్కేందుకు తాడు వేసుకుని ప్రయత్నం చేస్తుండగా.. ఇంతలో అక్కడకు వచ్చిన ఓ బౌద్ధ సన్యాసి వారికి ఊహించని షాక్ ఇచ్చాడు.. ఏ తాడూ లేకుండా మెట్లు ఎక్కినంత సులువుగా అదే కొండను ఎక్కేస్తూ వారికి ట్విస్ట్ ఇచ్చాడు. దీన్ని అక్కడే ఉన్న పర్వాతారోహకులు ఆశ్చర్యంతో వీడియో తీశారు. మెడిటేషన్, యోగా, సాధన వల్లే సాధువు అంత సునాయాసంగా కొండను ఎక్కగలుగుతున్నట్టు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి