Panaji: వేగం అదుపుతప్పి నదిలోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు గల్లంతు

నది వంతెనపై నుంచి వస్తున్న కారు ప్రమాదవశాత్తూ నదిలో పడిపోయింది. నదిలో పడిన కారును ఓ మహిళ నడుపుతోందని, కారులో..

Panaji: వేగం అదుపుతప్పి నదిలోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు గల్లంతు
Zuari River
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 28, 2022 | 2:30 PM

Panaji: అతి వేగం ప్రాణాంతకం అంటూ ట్రాఫిక్‌ పోలీసులు పదే పదే హెచ్చరిస్తున్నప్పటికీ వాహనదారులు పెడచెవిని పెడుతున్నారు. మితిమీరిన వేగంతో డ్రైవ్‌ చేస్తున్న వారితో పాటు తోటివారిని సైతం ప్రమాదంలోకి నెట్టెస్తుంటారు. తాజాగా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. వంతెనపై వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి నదిలోకి దూసుకెళ్లింది. ఆ నలుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నట్టుగా తెలిసింది. గల్లంతైన వారి కోసం రెస్క్యూ టీం గాలింపు చేపట్టింది. ఈ ఘటన గోవాలో గురువారం రోజున జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే…

దక్షిణ గోవా జిల్లాలోని జువారి నది వంతెనపై నుంచి వస్తున్న కారు ప్రమాదవశాత్తూ నదిలో పడిపోయింది. నదిలో పడిన కారును ఓ మహిళ నడుపుతోందని, కారులో నలుగురున్నారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఇండియన్ కోస్ట్ గార్డ్స్, నేవీ, అగ్నిమాపకశాఖ, ఎమర్జెన్సీ సర్వీసుల శాఖ, గోవా పోలీసులు కలిసి నదిలో పడిన కారుకోసం గాలింపు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

కారులో ఉన్నవారి కూడా వెలికి తీసేందుకు నదిలో విస్తృతంగా గాలిస్తున్నారు. గోవా రాజధాని పనాజీకి 15 కిలోమీటర్ల దూరంలోని కొర్టాలిమ్ గ్రామం వద్ద జాతీయ రహదారి వంతెనపై కారును దాటబోయి నదిలో పడిపోయిందని పోలీసులు చెప్పారు. వంతెన రెయిలింగ్‌ను ఢీకొని కారు నదిలో పడిందని పోలీసులు పేర్కొన్నారు.నదిలో పడిన వారి కోసం ఇండియన్ నేవీ డైవర్స్ కూడా గాలిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి