Covid-19: తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. థర్డ్ వేవ్ తర్వాత తొలిసారి సెంచరీకి చేరువగా..
అలాగే కొత్తగా 640 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,915 యాక్టివ్ కేసులున్నాయి. కొత్త కేసులతో..
Telangana: తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24గంటల్లో 36,764 కరోనా పరీక్షలు నిర్వహించగా 852 కొత్త కేసులు నమోదయ్యాయి. థర్డ్‌వేవ్ తర్వాత ఒక్కరోజే 800 దాటి పాజిటివ్ కేసులు నమోదవడం ఇదే తొలిసారి. అలాగే కొత్తగా 640 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,915 యాక్టివ్ కేసులున్నాయి. కొత్త కేసులతో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో (358) నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,16,531కు పెరిగింది. అందులో 8,07,505 మంది బాధితులు కోలుకున్నారు. అలాగే 4,111 మంది కరోనాతో మృతి చెందారు.
కొత్త కేసులతో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 358, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 63, రంగారెడ్డిలో 57, పెద్దపల్లిలో 35, మహబూబాబాద్‌లో 32, ఖమ్మంలో 28, హన్మకొండలో 26, నల్గొండలో 26, జనగామలో 26, కరీంనగర్‌లో 24, భద్రాద్రి కొత్తగూడెంలో 22 కేసులు నమోదయ్యాయి.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి