AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Rains: ఉప్పొంగిన భీమేశ్వర వాగు.. వరదలో చిక్కుకున్న రైతులు, కూలీలు.. సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన రెస్క్యూ బృందం

భీమేశ్వర వాగు ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. ఉదయం వ్యవసాయ పనుల నిమిత్తం వాగు అవతలి వైపు వెళ్లిన రైతు కూలీలు అక్కడే చిక్కుకున్నారు. వ్యవసాయ పనుల నిమిత్తం సుమారు రెండు వందల మంది సంతాయిపేట్, చిట్యాల గ్రామాలకు చెందిన రైతు కూలీలు అక్కడే చిక్కుకుపోయారు.

Telangana Rains: ఉప్పొంగిన భీమేశ్వర వాగు.. వరదలో చిక్కుకున్న రైతులు, కూలీలు.. సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన రెస్క్యూ బృందం
Telangana Rains
Surya Kala
|

Updated on: Jul 28, 2022 | 8:08 AM

Share

Telangana Rains: గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు వరదలు (Rains and Floods) బీభత్సం సృష్టిస్తున్నాయి. అనేక గ్రామాలు వరద ముంపుకు గురయ్యాయి. జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. వాగులు, నదులు, ప్రాజెక్టులు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం సమయంలో తాడ్వాయి మండలం ఏర్రపాహడ్, దేమే గ్రామాల్లో కురిసిన భారీ వర్షాలు కురిశాయి. దీంతో సంతాయిపేట్ గ్రామ శివారులోని భీమేశ్వర వాగు ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. ఉదయం వ్యవసాయ పనుల నిమిత్తం వాగు అవతలి వైపు వెళ్లిన రైతు కూలీలు అక్కడే చిక్కుకున్నారు. వ్యవసాయ పనుల నిమిత్తం సుమారు రెండు వందల మంది సంతాయిపేట్, చిట్యాల గ్రామాలకు చెందిన రైతు కూలీలు అక్కడే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అధికారులు చర్యలు చేపట్టారు.

వరదలో చిక్కుకున్న రైతు కూలీలను గ్రామానికి చేర్చేందుకు చర్యలు చేపట్టమని మంత్రి ప్రశాంత్ రెడ్డి  ఆదేశాల మేరకు స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్, కామారెడ్డి అదనపు ఎస్పీ అన్యోన్య, రెవెన్యూ శాఖ అధికారులు, పోలీసులు, రిస్కు టీమ్ లు సంఘటన స్థలానికి చేరుకుని జే సి బి సహయంతో మొత్తం మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. సుమారు నాలుగు గంటలు శ్రమించి సుమారు రెండు వందల మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అంతకు ముందు పోలీసు అధికారులు, గ్రామస్థుల సహకారంతో ఆహారం, నీటి బాటిళ్లను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే సురేందర్ మాట్లాడుతూ వరద ప్రవాహం ప్రతి ఏడాది లాగానే మామూలుగా కాకుండా మధ్యాహ్నం కురిసిన భారీ వర్షాలకు భీమేశ్వర వాగు ఉదృతంగా ప్రవహించిన సందర్భంగా మంత్రి కెటిఆర్, స్థానిక మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గార్ల ఆదేశాల మేరకు హైదరాబాద్ నుండి హూటావుటిన సంఘటన స్థలానికి చేరుకుని ఇక్కడి పరిస్థితిని సమీక్షించారు. జే సి బి లో అవతలి ఒడ్డుకు చేరుకుని రైతులందరిని సురక్షితంగా ఒడ్డుకు చేర్పించారు. అప్పటికే సంఘటన స్థలానికి పోలీసులు, రెవెన్యూ అధికారులు చేరుకుని రైతులను తరలించేందుకు ఏర్పాట్లు చేశారని తెలిపారు. గ్రామ ప్రజలు మాట్లాడుతూ ఎమ్మెల్యే సురేందర్ గారు వచ్చి తమను సురక్షితంగా ఒడ్డుకు తరలించారని వారికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..