Nizamabad Rains: నిజామాబాద్ లో భారీ వర్షాలు .. వరద ముంపు పరిస్థితిపై అధికారులకు ఎమ్మెల్సీ కవిత ఆదేశాలు
భారీ వర్షాలు, వరదల పరిస్థితులపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మరియు స్పెషల్ ఆఫీసర్ క్రిస్టిన తో ఫొన్ లో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
Nizamabad Rains: నిజామాబాద్ జిల్లాలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రహదారులు నదులను తలపిస్తున్నాయి.. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. దీంతో భారీ వర్షాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. భారీ వర్షాలు, వరదల పరిస్థితులపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మరియు స్పెషల్ ఆఫీసర్ క్రిస్టిన తో ఫొన్ లో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యుత్ సౌకర్యం, ఇతర మౌళిక సదుపాయాల విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సత్వర కార్యచరణ రూపొందించాలని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.
నందిపేట్, సిరికొండ, బోధన్ నియోజకవర్గాలకు మంజూరు చేసిన ప్రత్యేక అంబులెన్స్ లు ప్రజలకు విరివిగా అందుబాటులో ఉంచాలని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
లోతట్టు ప్రాంతాల్లో పంటలు నష్టపోయిన రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దన్న ఎమ్మెల్సీ కవిత, నష్టాలను అంచనా వేసి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. వరదముంపు పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన ఆఫీసర్ క్రిస్టినా మధ్యాహ్నం నిజామాబాద్ లో పర్యటించనున్నారు.
MLC @RaoKavitha reviews the situation of rains and floods on the phone with Nizamabad Dist Collector Narayana Reddy and Special Officer Christina Special Officer Christina Chongtu to visit Nizamabad today Kavitha asked the authorities to pay special attention to the inland areas pic.twitter.com/f5BqInCK2Q
— Latha (@LathaReddy704) July 11, 2022
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..