AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zelensky : భార్యతో ఉక్రెయిన్ అధ్యక్షుడి ఫొటో షూట్‌.. సోషల్ మీడియా వేదికగా నెటిజన్ల ఫైర్‌..

అయితే, 4 నెలల యుద్ధం తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ వివాదంలో చిక్కుకున్నారు. అందుకు కారణం.. అతను తన భార్య, ప్రథమ మహిళ ఒలెనా జెలెన్స్కాతో కలిసి ఫోటో షూట్ చేయడమే..

Zelensky : భార్యతో ఉక్రెయిన్ అధ్యక్షుడి ఫొటో షూట్‌.. సోషల్ మీడియా వేదికగా నెటిజన్ల ఫైర్‌..
Zelensky
Jyothi Gadda
|

Updated on: Jul 27, 2022 | 9:01 PM

Share

Zelensky :  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించిన యుద్ధం కారణంగా ఉక్రెయిన్ తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఫిబ్రవరి 24న, పుతిన్ ఉక్రెయిన్‌లో సైనిక దాడులను ప్రారంభించాడు… ఫలితంగా, ప్రజలు పెద్ద సంఖ్యలో నిరాశ్రయులయ్యారు. యుద్ధంలో దెబ్బతిన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తన ప్రజలకు ఆశాజ్యోతిగా నిలిచారు. యుద్ధ పరిస్థితిని పరిశీలించడానికి మరియు ప్రజల్ని రక్షించడానికి యుద్ధం రంగంలోకి దిగి హీరోగా నిలిచారు. అతని వీరోచిత వ్యూహాలు విజయవంతమయ్యాయి. అయితే, 4 నెలల యుద్ధం తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ వివాదంలో చిక్కుకున్నారు. అందుకు కారణం.. అతను తన భార్య, ప్రథమ మహిళ ఒలెనా జెలెన్స్కాతో కలిసి ఫోటో షూట్ చేయడమే.. ఆన్‌లైన్‌లో ఆ ఫోటోలు తీవ్రంగా వైరల్ అయ్యాయి. 4 నెలల యుద్ధం తర్వాత, Zelenskyy ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా క్రూరంగా ట్రోల్ చేయబడుతున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Vogue (@voguemagazine)

ప్రఖ్యాత వోగ్‌ మ్యాగజైన్‌ పత్రికకు ఒలెనా జెలెన్‌స్కా ఇటీవల ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందుకోసం జెలెన్‌స్కీ, ఆయన సతీమణి ఇద్దరూ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. అధ్యక్ష భవనంలో వీరిద్దరూ చేతిలో చేయి వేసుకుని ఫొటోకు పోజిచ్చారు. ఈ జంట టేబుల్‌కి అడ్డంగా చేతులు పట్టుకుని పోజులిచ్చారు. ఆలింగనం చేసుకునే ఫోజులు కూడా ఇచ్చారు.

ఇక ఉక్రెయిన్‌లోని సంఘర్షణ పరిస్థితిని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఒలెనా యుద్ధ ట్యాంకులు, సైనికులతో కలిసి ఫొటో దిగారు.

ప్రముఖ ఫోటోగ్రాఫర్ అన్నీ లీబోవిట్జ్ ఛాయాచిత్రాలను తీశారు. వాటిని ఒలెనా జెలెన్స్కా తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ నుండి పంచుకున్నారు. అయితే, ఈ ఫొటోలపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు వీరిని సమర్థిస్తుండగా.. చాలా మంది విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. దేశంపై రష్యా బాంబులు జారవిడుస్తుంటే జెలెన్‌స్కీ ఇలాంటి ఫొటోషూట్‌లో పాల్గొనడమేంటని ప్రశ్నిస్తున్నారు.

Follow Us
ఇవి రెండు ఆకులు నమిలితే షుగర్ జీవితంలో రాదు.! ఇక మందులతో పనుండదు
ఇవి రెండు ఆకులు నమిలితే షుగర్ జీవితంలో రాదు.! ఇక మందులతో పనుండదు
భారత్ నుండి అమెరికాకు నడక దారి!రోజుకు 15 కిలోమీటర్లు నడిస్తే చాలు
భారత్ నుండి అమెరికాకు నడక దారి!రోజుకు 15 కిలోమీటర్లు నడిస్తే చాలు
ఇదొక్క ట్రిక్ తెలిస్తే.. ఏసీ లేకుండానే ఇంటిని చల్లగా ఉంచుకోవచ్చు!
ఇదొక్క ట్రిక్ తెలిస్తే.. ఏసీ లేకుండానే ఇంటిని చల్లగా ఉంచుకోవచ్చు!
రూ.15వేలలోపు చెల్లింపులు చేస్తున్నారా..? ఆర్బీఐ ఊరట..
రూ.15వేలలోపు చెల్లింపులు చేస్తున్నారా..? ఆర్బీఐ ఊరట..
సెంచరీ కొట్టావ్ సామీ.. ఇంకేం నేర్చుకుంటావ్?
సెంచరీ కొట్టావ్ సామీ.. ఇంకేం నేర్చుకుంటావ్?
మనీ ప్లాంట్‌తో ఈ మొక్క నాటితే ఇంట్లో సంపద పెరుగుతుందా? వాస్తు..
మనీ ప్లాంట్‌తో ఈ మొక్క నాటితే ఇంట్లో సంపద పెరుగుతుందా? వాస్తు..
ఈ తెలుగు బ్లాక్ బస్టర్ మూవీని చూసి ఏకంగా 40 మంది ఆత్మహత్యలు
ఈ తెలుగు బ్లాక్ బస్టర్ మూవీని చూసి ఏకంగా 40 మంది ఆత్మహత్యలు
ప్రామిసరీ నోటు ఉన్నా డబ్బులు ఎగ్గొట్టారా.? ఈ ఒక్క పని చేస్తే..
ప్రామిసరీ నోటు ఉన్నా డబ్బులు ఎగ్గొట్టారా.? ఈ ఒక్క పని చేస్తే..
ప్రతీ మూడు నిమిషాలకు మెట్రో సర్వీస్.. హైదరాబాద్ మెట్రో డెసిషన్
ప్రతీ మూడు నిమిషాలకు మెట్రో సర్వీస్.. హైదరాబాద్ మెట్రో డెసిషన్
కోడి కాళ్లను ఇలా కూడా వాడొచ్చా? దోస్త్‌కి ఇష్టమైన ఫ్లవర్‌ బొకే!
కోడి కాళ్లను ఇలా కూడా వాడొచ్చా? దోస్త్‌కి ఇష్టమైన ఫ్లవర్‌ బొకే!