Tamil Nadu: తమిళనాడులో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఐదుకు చేరిన స్టూడెంట్‌ సూసైడ్‌ కేసులు

వరుస సూసైడ్ ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి.  వరుసగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రెండు వారాల్లో ఐదు ఘటనలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి.

Tamil Nadu: తమిళనాడులో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఐదుకు చేరిన స్టూడెంట్‌ సూసైడ్‌ కేసులు
Suicide
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 27, 2022 | 6:36 PM

Tamil Nadu: తమిళనాడులో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగటం లేదు.. వరుస సూసైడ్ ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి.  వరుసగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రెండు వారాల్లో ఐదు ఘటనలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. తమిళనాడులోని శివగంగా నగర్‌కు చెందిన 12వ తరగతి చదువుతున్న విద్యార్థి తన ఇంట్లో శవమై కనిపించాడు. అతని పక్కన ఓ సూసైడ్ లేఖ పోలీసులకు లభించింది. తనకు చదువు సరిగ్గా ఎక్కడం లేదని సూసైడ్‌ లేఖలో పేర్కొన్నాడు. మంగళవారం శివకాశి సమీపంలో 11వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల బాలిక తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. బాలిక తల్లిదండ్రులు కన్నన్, మీనా క్రాకర్ ఫ్యాక్టరీలో రోజువారీ కూలీగా పనిచేస్తున్నారు. పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత బాలిక తమ ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడింది. అయితే బాలిక మృతికి గల కారణాలు తెలియరాలేదు.

అంతకు ముందే జులై25న 12వ తరగతి చదువుతున్న బాలిక కడలూరులోని తన ఇంట్లో శవమై కనిపించింది. తల్లి మందలించడంతో ఆమె మనస్తాపానికి గురైనట్లు సమాచారం. అదే రోజు తిరువళ్లూరు జిల్లాలోని ప్రభుత్వ-ఎయిడెడ్ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న మరో బాలిక తన హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడింది. తదుపరి విచారణలు కొనసాగుతున్నాయి. ఇంతకు ముందు ఆత్మహత్యలు చేసుకున్న వారిలో ముగ్గురు 12వ తరగతి విద్యార్థులే కావడం గమనార్హం. క్రితం రోజు కడలూరులో మరో 12వ తరగతి విద్యార్థి మరణించిన సంగతి విదితమే. తల్లిదండ్రులు తనను ఐఏఎస్‌ చేయాలనుకున్న ఆకాంక్షలను నెరవేర్చలేకపోతున్నాననంటూ ఆత్మహత్య లేఖలో పేర్కొన్నాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి తింటే.. నెలరోజుల్లో మీ జుట్టు ఒత్తుగా పెరగడం పక్కా.. అందం
ఇవి తింటే.. నెలరోజుల్లో మీ జుట్టు ఒత్తుగా పెరగడం పక్కా.. అందం
కేసీఆర్ సినిమా చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్న రాకేష్, సుజాత..
కేసీఆర్ సినిమా చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్న రాకేష్, సుజాత..
కారు కొనుగోలుదారులకు బ్యాడ్‌ న్యూస్‌.. జనవరి 1 నుంచి ధరలు పెంపు
కారు కొనుగోలుదారులకు బ్యాడ్‌ న్యూస్‌.. జనవరి 1 నుంచి ధరలు పెంపు
పెర్త్‌లో సెంచరీతో చెలరేగిన జైస్వాల్.. భారీ ఆధిక్యం దిశగా భారత్
పెర్త్‌లో సెంచరీతో చెలరేగిన జైస్వాల్.. భారీ ఆధిక్యం దిశగా భారత్
ఏఆర్ రెహమాన్ సీరియస్ వార్నింగ్..
ఏఆర్ రెహమాన్ సీరియస్ వార్నింగ్..
BSNL, Jioలో 70 వ్యాలిడిటీ ప్లాన్‌ గురించి తెలుసా? ఏది చౌకైనది..!
BSNL, Jioలో 70 వ్యాలిడిటీ ప్లాన్‌ గురించి తెలుసా? ఏది చౌకైనది..!
అరటిపండు, యాపిల్ కలిపి తింటే ఏమవుతుందో తెలుసా..?తప్పక తెలుసుకోండి
అరటిపండు, యాపిల్ కలిపి తింటే ఏమవుతుందో తెలుసా..?తప్పక తెలుసుకోండి
కల్తీ నెయ్యి కథ తేలే సమయం వచ్చేసింది.. తిరుమల లడ్డు విచారణలో
కల్తీ నెయ్యి కథ తేలే సమయం వచ్చేసింది.. తిరుమల లడ్డు విచారణలో
నెయ్యిలో వేయించిన వెల్లుల్లి తినడం వల్ల బోలెడన్నిఆరోగ్యప్రయోజనాలు
నెయ్యిలో వేయించిన వెల్లుల్లి తినడం వల్ల బోలెడన్నిఆరోగ్యప్రయోజనాలు
ఈవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఆమెనా..
ఈవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఆమెనా..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!