Wedding Viral Video: పెళ్లి బరాత్‌లో రెచ్చిపోయిన గుర్రం.. ఏం చేసిందో తెలిస్తే షాక్‌ అవుతారు..

బరాత్ సమయంలో వధూవరులను ఊరేగించేందు కోసం గుర్రాన్ని సిద్ధం చేశారు. కానీ, ఇంకా కొత్త జంట గుర్రంపై కూర్చోలేనట్టుగానే తెలుస్తోంది. కానీ, ఇపులోగానే..

Wedding Viral Video: పెళ్లి బరాత్‌లో రెచ్చిపోయిన గుర్రం.. ఏం చేసిందో తెలిస్తే షాక్‌ అవుతారు..
Horse
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 27, 2022 | 5:13 PM

Wedding Viral Video: మ‌నం ప్రతి రోజు సోష‌ల్ మీడియాలో ఎన్నో ర‌కాల ఫన్నీ వీడియోలు చూస్తుంటాం. వాటిలో చాలా వ‌ర‌కు జంతువులు, పక్షులు, పాములు, చిన్నారుల ఆటపాటలు, అల్లరి చేష్టలతో పాటు.. పెళ్లిళ్ల సంబంధించిన వీడియోలు కూడా అనేకం చూస్తుంటాం..వాటిల్లో కొన్ని ఫ‌న్నీగా….మ‌రికొన్ని వింత‌గానూ ఉంటాయి. తాజాగా ఓ పెళ్లి బ‌రాత్‌కు చెందిన ఫ‌న్నీ వీడియో ఒక‌టి నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. పెళ్లి వేడుక అంటేనే సందడి.. ఇంటినిండా బంధువులు, స్నేహితులు.. వ‌ధూవ‌రులు.. కుటుంబ స‌భ్యులంద‌రూ కూడా ఆనందంలో మునిగిపోతారు. ఇకపోతే, సాధారణంగా పెళ్లి ఊరేగింపులో గుర్రాలను వినియోగిస్తుంటారు. అయితే.. మేళతాళాలు, టపాకుల మోతకు గుర్రాలు బెదిరిపోయిన సంఘటనలను మనం అనేకం చూసుంటాం.. ఇలాంటి సమయాల్లో గుర్రాలను నియంత్రించడం చాలా కష్టంగా మారుతుంది. ఈ క్రమంలో ఊహించని ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి.అయితే, ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగనప్పటికీ, ఆరుగురు గాయాలపాలైన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో చోటుచేసుకుంది. కాగా, వీడియో మాత్రం నెటింట్ట నవ్వులు పూయిస్తోంది.

సోషల్ మీడియాలో పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. బరాత్ సమయంలో వధూవరులను ఊరేగించేందు కోసం గుర్రాన్ని సిద్ధం చేశారు. కానీ, ఇంకా కొత్త జంట గుర్రంపై కూర్చోలేనట్టుగానే తెలుస్తోంది. కానీ, ఇపులోగా.. పెళ్లికి వచ్చిన అతిథుడులు, స్నేహితులు.. ఆ గుర్రం చుట్టూ చేరిపోయి హంగామా చేశారు. డీజే పాటల హోరు, మేళతాళలతో గుర్రం చూట్టు గుమిగూడి వారంతా డ్యాన్స్‌లతో దుమ్ములేపుతున్నారు. లౌడ్ స్పీకర్లలో ‘తేరే ఇష్క్ మే నాచెంగే’ సాంగ్‌ పెద్ద సౌండ్‌తో ప్లే అవుతోంది. అయితే వారి హంగామా, మేళ తాళాలకు ఆ గుర్రం బెదిరిపోయింది. మరోవైపు అక్కడ ఉన్నట్టుండి క్రాకర్స్‌ కాల్చారు. దీంతో మరింత బెదిరిపోయిన గుర్రం అక్కడి నుంచి పరుగులు తీసింది. గుర్రం ముందు రెండు కాళ్లను పైకి లేపి అడ్డుగా వచ్చిన వారందరినీ తొక్కుకుంటూ పరుగులు తీసింది. దాని వెనుక గుర్రం యజమాని సహా.. కుటుంబసభ్యులు కూడా పరుగులు తీశారు.

ఇవి కూడా చదవండి

ఊహించని ఈ ఘటనకు పెళ్లి కుమారుడు, అతని కుటుంబ సభ్యులు, బంధువులు షాకయ్యారు. గుర్రం తొక్కుకుంటూ వెళ్లటంతో ఆరుగురికి గాయాలైనట్టు తెలిసింది. అయితే, ఈ సంఘటన యుపిలోని హమీర్‌పూర్‌లో జరిగినట్టుగా తెలిసింది. గాయపడిన వారిని సమీప ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్టుగా తెలిసింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి