AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Students Suicides: మరో విద్యార్థిని బలవన్మరణం.. 24గంటల్లో ఇద్దరు.. రెండు వారాల్లో నలుగురు విద్యార్థులు ఆత్మహత్య.. సీఎం సీరియస్‌

పదే పదే టీనేజీ విద్యార్థినుల ఆత్మహత్యల పట్ల రాష్ట్ర ముఖ్య మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నారులపై మానసిక, శారీరక, లైంగిక వేధింపులకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జీవితం విలువైనది..

Students Suicides: మరో విద్యార్థిని బలవన్మరణం.. 24గంటల్లో ఇద్దరు.. రెండు వారాల్లో నలుగురు విద్యార్థులు ఆత్మహత్య.. సీఎం సీరియస్‌
Suicide
Jyothi Gadda
|

Updated on: Jul 27, 2022 | 3:46 PM

Share

Students Suicides:  తమిళనాడులో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. శివకాశి సమీపంలోని అయ్యంపెట్టి గ్రామానికి చెందిన ప్లస్ వన్ విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. అయ్యంబట్టి ప్రాంతంలో నివసిస్తున్న విద్యార్థి తమ ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో గత రెండు వారాల్లో తమిళనాడులో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య నాలుగుకు చేరింది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని.. కన్నన్, మీనా దంపతుల చిన్న కూతురు. వీరు క్రాకర్ ఫ్యాక్టరీలో దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. తల్లిదండ్రులు పనికి వెళ్లిన సమయంలో కూతురు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు చెబుతూ మృతురాలి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.

కడలూరులో ప్లస్ టూ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న 24 గంటల ముందు మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవటం అందరినీ తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.. గత రెండు వారాల్లో తమిళనాడులో జరిగిన నాలుగో విద్యార్థి ఆత్మహత్య ఘటన తల్లిదండ్రులు, విద్యాశాఖ సిబ్బందితో సహా అధికారులకు సైతం అంతుచిక్కటం లేదు. తొలుకూరిలో ఉపాధ్యాయుల వేధింపులు తాళలేక గతవారం విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర నిరసనలకు దారి తీసింది. తల్లిదండ్రులు, విద్యార్థుల ఆందోళనతో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. దాంతో తొల్లుకురితిలోని పాఠశాల పరిసర ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. తిరువళ్లూరు జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థి కూడా గత వారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన బాలిక.. ఇంట్లో ఉన్న అమ్మమ్మ బయటకు వెళ్లగానే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి తిరిగి వచ్చిన వృద్ధురాలు ఆమె ఉరివేసుకుని ఉండటం చూసి షాక్‌కు గురయ్యింది. వెంటనే సహాయం కోసం గట్టిగా కేకలు వేసింది. దీంతో ఆమె ఇరుగుపొరుగువారు అక్కడికి చేరుకుని విషయం తెలుసుకున్నారు. వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.

ఇవి కూడా చదవండి

టీనేజీ విద్యార్థినుల మృతిపై తమిళనాడు ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తూ తక్షణమే చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ‘మానవర్ మానస్’ పథకం కింద పాఠశాల విద్యార్థులకు కౌన్సెలింగ్ అందించేందుకు త్వరలో 800 మంది వైద్యులను నియమించనున్నట్లు సమాచారం. కౌమార సమస్యలు, చదువు ఒత్తిడి, తోటివారి ఒత్తిడి వంటి పిల్లల ప్రవర్తనాపరమైన మార్పులకు సంబంధించిన సమస్యల మధ్య మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఈ పథకం దోహదపడుతుందని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేశ్ పొయ్యమొళి తెలిపారు.

పదే పదే టీనేజీ విద్యార్థినుల ఆత్మహత్యల పట్ల ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. జీవితం విలువైనది. చిన్న చిన్న కారణలతో ఆత్మహత్య ఆలోచనలు చేయటం సరికాదని సూచించారు.. చెన్నైలోని ఓ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్టాలిన్ మాట్లాడుతూ.. చిన్నారులపై మానసిక, శారీరక, లైంగిక వేధింపులకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి