BJP: మాతో 21 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన మిథున్ చక్రవర్తి..
Mithun Chakraborty: బాలీవుడ్ సీనియర్ నటుడు , బీజేపీ నేత మిథున్ చక్రవర్తి సంచలన ప్రకటన చేశారు. బీజేపీతో 38 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని ప్రకటించారు. అంతేకాకుండా తనతో 21 మంది నేరుగా సంప్రదింపులు జరుపుతున్నారని పేర్కొన్నారు. బెంగాల్‌లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీ అధికారం లోకి వస్తుందన్నారు మిథున్.
బెంగాల్ బీజేపీ నాయకుడు, స్టార్ హీరో మిథున్ చక్రవర్తి బాంబు పేల్చారు. తమ పార్టీకి టచ్‌లో 38 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు ఉన్నారంటూ ప్రకటించారు. మరో అడుగుముందుకేసిన ఆయన 38 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉంటే.. ఇందులో 21 మంది ఎమ్మెల్యేలతో తానే స్వయంగా చర్చలు జరుపుతున్నానంటూ సంచలన ప్రకటన చేశారు. నటుడు మిథున్ చక్రవర్తి బుధవారం షాకింగ్ క్లెయిమ్ చేశారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 38 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని అన్నారు. 21 మంది ఎమ్మెల్యేలతో తానే స్వయంగా చర్చలు జరుపుతున్నానని చెప్పారు. కోల్‌కతాలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మిథున్ ఈ ప్రకటన చేశారు. మీరు బ్రేకింగ్ న్యూస్ తెలుసుకోవాలనుకుంటున్నారా అని జర్నలిస్టులను అడిగాడు. 38 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారని, అందులో 21 మంది ఎమ్మెల్యేలతో నేనే మాట్లాడుతున్నానని బ్రేకింగ్ న్యూస్ అంటూ ప్రకటించారు.
అల్లర్లలో బీజేపీ ప్రమేయం ఉందంటే రెండు రుజువులు
ఇది కాకుండా బీజేపీ అల్లర్లకు పాల్పడుతోందని, అల్లర్లకు బీజేపీ కారణమని ఎప్పుడూ ఆరోపిస్తూనే ఉంటారని, అయితే ఈ అల్లర్లలో బీజేపీ ప్రమేయం ఉందని నిర్ధారించే ఒక్క సంఘటన చూపించాలని సవాల్ విసిరారు. మరోవైపు, పార్థ ఛటర్జీ కేసుపై మిథున్ మాట్లాడుతూ, అతనికి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేకపోతే.. ప్రశాంతం నిద్రపోండి. కానీ సాక్ష్యం అతనికి వ్యతిరేకంగా ఉంటే మిమ్మల్ని ఎవరూ రక్షించలేరు అన్నారు.
West Bengal | Do you want to hear breaking news? At this moment, 38 TMC MLAs have very good relations with us, out of which 21 are in direct (contact with us): BJP leader Mithun Chakraborty in Kolkata pic.twitter.com/yF5zD2FBff
— ANI (@ANI) July 27, 2022
భారతదేశంలోని 3 పెద్ద స్టార్లు ..
అయితే ముస్లింలపై బిజెపి ద్వేషం అనే ప్రశ్నకు మిథున్ చక్రవర్తి భారతదేశంలోని మొదటి ముగ్గురు స్టార్లు ముస్లింలే అని అన్నారు. సల్మాన్, షారుక్, అమీర్! అది ఎలా సాధ్యమవుతుంది? 18 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. బిజెపి వారిని ద్వేషిస్తే లేదా హిందువులు వారిని ప్రేమించకపోతే, వారి సినిమాలు ఈ రాష్ట్రాల నుంచి ఎలా అత్యధిక కలెక్షన్లు సాధిస్తాయి. టీచర్ రిక్రూట్‌మెంట్ స్కాంలో 1000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. అయితే మిథున్ చక్రవర్తి వ్యాఖ్యలను బెంగాల్‌లో ఒక్కరు కూడా నమ్మరని టీఎంసీ కౌంటరిచ్చింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..