AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మన స్టైలే వేరప్ప.. సైకిల్ పై నుంచి పడి లేచి డ్యాన్స్.. ఈ బుడ్డొడి కాన్ఫిడెన్స్‏కు ఫిదా అవ్వాల్సిందే..

ఈ చిన్న వీడియో క్లిప్ ఇంటర్నెట్ వినియోగదారులను విస్మయానికి గురిచేసింది. చాలా మంది నెటిజన్లు హార్ట్ ఎమోజీలతో కామెంట్‌ బాక్స్‌ నింపేస్తున్నారు.

Viral Video: మన స్టైలే వేరప్ప.. సైకిల్ పై నుంచి పడి లేచి డ్యాన్స్.. ఈ బుడ్డొడి కాన్ఫిడెన్స్‏కు ఫిదా అవ్వాల్సిందే..
Little Boy Dances
Jyothi Gadda
|

Updated on: Jul 27, 2022 | 6:17 PM

Share

Viral Video: సోషల్ మీడియా పుణ్యమా అని వైరల్‌ వీడియోలకు కొదువేలేదు.. ఇంటర్‌నెట్‌ వేదికగా ఎప్పుడు ఏది వైరల్‌ అవుతుందో చెప్పలేము. ముఖ్యంగా ఫన్నీ వీడియోలు ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంటాయి. అలాంటి వీడియోలనే నెటిజన్లు ఎక్కువగా లైక్‌ చేస్తుంటారు. ఈ క్రమంలో ప్రత్యేకించి చిన్నపిల్లల వీడియోలు ఎక్కువగా వైరల్‌ అవుతుంటాయి. వారి అల్లారి పనులకు సంబంధించిన వీడియోలు నెటిజన్ల మనుసును హత్తుకుంటాయి. .తాజాగా అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట్లో తెగ హల్‌చల్ చేస్తోంది. ఇక్కడ మనం చూస్తున్న పిల్లవాడు డ్యాన్ చూస్తే.. నిజంగా మనకే దిమ్మతిరిగి, మైండ్‌ బ్లాంక్‌ అవుతుంది.. పూర్తి వివరాల్లోకి వెళితే..

చిన్న సైకిల్‌ తొక్కుతూ రోడ్డుపై వెళ్తు్న్న ఓ బుడ్డొడు..కింద పడిపోతాడు.. ఆ తర్వాత ఉన్నట్టుండి అతడు..రెచ్చిపోయిన డ్యాన్స్‌తో అందరికీ పిచ్చెక్కించాడు.. హిస్టీరికల్ డ్యాన్స్‌తో షేక్ చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ట్విట్టర్‌లో షేర్ చేయబడిన ఈ చిన్న క్లిప్ ఇప్పటికే ఐదు మిలియన్లకు పైగా వీక్షణలు, 200,000 లైక్‌లను పొందింది.

ఇవి కూడా చదవండి

వైరల్‌ అవుతున్న వీడియోలో.. ఒక పిల్లవాడు తన సైకిల్ తొక్కుతున్నట్లు చూడొచ్చు. అయితే, కొన్ని సెకన్ల తర్వాత, అతను బ్యాలెన్స్ కోల్పోవడంతో రోడ్డుపై పడిపోయాడు. కానీ, ఆ వెంటనే పైకి లేచిన బుడ్డొడు.. విచారంగా గానీ, ఏడవడం గానీ, చేయలేదు.. విచిత్రం రెచ్చిపోయి డ్యాన్స్‌ చేశాడు..ఇలాంటి సవాళ్లు ఎదురైనప్పుడు మరింత కాన్ఫిడెన్స్‌తో ముందుకు వెళ్లాలి అన్నట్టుగా చిన్నోడు తన డ్యాన్స్‌తో అదరగొట్టాడు.

ఈ చిన్న వీడియో క్లిప్ ఇంటర్నెట్ వినియోగదారులను విస్మయానికి గురిచేసింది. చాలా మంది నెటిజన్లు హార్ట్ ఎమోజీలతో కామెంట్‌ బాక్స్‌ నింపేస్తున్నారు. చాలా మంది వినియోగదారులు చిన్న పిల్లవాడిని “లెజెండ్” అని కూడా పిలుస్తున్నారు. మరికొందరు అతన్ని “రాక్‌స్టార్” గా అభివర్ణిస్తున్నారు. ఇలాంటి భిన్నమైన కామెంట్లతో నెటిజన్లు ఈ వీడియోను మరింత వైరల్‌గా మార్చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!